Friday, April 19, 2024

అమిత్ షా పిలుపు.. 140 ఆయుధాల అప్పగింత

- Advertisement -
- Advertisement -

ఇంఫాల్: తమ వద్ద ఉన్న అక్రమ ఆయుధాలను అప్పగించాల్సిందిగా మణిపూర్‌లోని ప్రజలకు కేంద్ర హోం మంత్రి విజ్ఞప్తి చేసిన ఒక రోజు తర్వాత రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో 140కి పైగా ఆయుధాలను అప్పగించినట్లు అధికార వర్గాలు శుక్రవారం తెలియజేశాయి. మణిపూర్‌లో తన నాలుగు రోజుల పర్యటన చివరి రోజయిన గురువారం నాడు అమిత్ షా అక్రమ ఆయుధాలను సైన్యానికి, అధికారులకు సరెండర్ చేయాల్సిందిగా పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.

రాష్ట్రవ్యాప్తంగా సోదాలు, కూంబింగ్ ఆపరేషన్లు నిర్వహించడం జరుగుతుందని, ఎవరివద్దనైనా ఆయుధాలు కలిగి ఉన్నట్లు తేలితే వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని కూడా ఆయన హెచ్చరించారు. ఇంఫాల్‌లో అమిత్ షా హెచ్చరిక తర్వాత శుక్రవారం ఉదయం వరకు 140కి పైగా ఆయుధాలను సరెండర్ చేసినట్లు అధికారులు తెలిపారు. మణిపూర్‌లో అక్కడక్కడ ఖాళీగా ఉన్న ఇళ్లు తగులబెట్టడం లాంటి సంఘటనలు జరిగినా పరిస్థితి మొత్తంమీద ప్రశాంతంగా ఉందని అధికారులు తెలిపారు. సరెండర్ చేసిన ఆయుధాల్లో సెల్ఫ్ లోడెడ్ రైఫిళ్లు, కార్బైన్, ఎకె, ఇన్సాస్ రైఫిళ్లు, లైట్ మెషిన్ గన్స్, పిస్టల్స్, ఎం 16 రైఫిళ్లు, స్మోక్ గన్, స్టెన్‌గన్,గ్రెనేడ్ లాంచర్ ఉన్నట్లు వారు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News