Tuesday, June 18, 2024

1400 కిలోల బంగారం పట్టివేత

- Advertisement -
- Advertisement -

చెన్నై: 1400 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్న సంఘటన తమిళనాడులోని కాంచీపురం జిల్లాలో జరిగింది. పోలీసులుత తెలిపిన వివరాల ప్రకారం…. శ్రీపెరుంబదుదూర్-కుండ్రత్తూర్ రహదారిలో వెళ్తున్న ప్రైవేటు సెక్యూరిటీ వాహనంలో పోలీసులు సోదాలు జరిపారు. తనిఖీలు నిర్వహించగా లారీలో 1000 కిలోల బంగారం, మరో మినీ కంటెయినర్‌లో 400 కిలోల బంగారాన్ని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. బంగారాన్ని చెన్నై విమానాశ్రయం నుంచి శ్రీపెరుంబుదూర్ ప్రాంతం మన్నూరులోని ఓ గోదాముకు తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. 400 కిలోల బంగారానికి ఆధారాలు ఉన్నాయని, మిగిలిన దానికి లేవని పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News