Saturday, October 12, 2024

సౌతాఫ్రికాలో కాల్పుల కలకలం.. 15 మంది మృతి

- Advertisement -
- Advertisement -

15 Killed In Bar Shooting Johannesburg

జోహన్నెస్‌బర్గ్‌: సౌతాఫ్రికాలో కాల్పుల కలకలం రేగింది. జోహన్నెస్‌బర్గ్‌లోని ఓ బార్ లో ఆదివారం తెల్లవారుజామున దుండుగుడు కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో 15 మంది మృతిచెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయలయ్యాయి. గాయపడిన ముగ్గురిని క్రిస్ హనీ బరగ్వానాథ్ ఆసుపత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. పోలీసుల కథనం ప్రకారం… శనివారం అర్థరాత్రి మినీబస్ ట్యాక్సీలో వచ్చిన కొంతమంది వ్యక్తులు బార్‌లోని కొంతమందిపై కాల్పులు జరిపారు. ఆదివారం ఉదయం మృతుల మృతదేహాలను బయటకు తీసి, సామూహిక కాల్పులకు దారితీసిన కారణాలపై దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News