Thursday, September 19, 2024

ఎల్లంపల్లి ప్రాజెక్టు 20 గేట్లు ఎత్తివేత

- Advertisement -
- Advertisement -

మంచిర్యాల జిల్లా, హాజిపూర్ మండలం, గుడిపేట ఎల్లంపల్లి ప్రాజెక్టు నిండుకుండలా మారింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు ఉప్పొంగుతున్నాయి. ఎగువ ప్రాంతాల్లోకి వర్షాలు దంచి కొడుతుండటంతో కడెం, శ్రీసాగర్ ప్రాజెక్టుల నుంచి వరద నీరు ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి భారీగా చేరుతోంది. ఎల్లంపల్లి ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 20.175 టిఎంసిలకు గాను 18.1471 టిఎంసిల సామర్ధానికి చేరింది. ప్రాజెక్టు నుండి హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్ పథకానికి 304 క్యూసెక్కులు, నంది పంపుహౌస్‌కు 9450 క్యూసెక్కుల నీటిని తరలిస్తున్నారు.

ఎగువ ప్రాంతాల నుండి భారీగా వరద నీరు ప్రాజెక్టులో వస్తుండటంతో ఆదివారం 20 గేట్లను అధికారులు ఎత్తివేశారు. దీంతో ప్రాజెక్టు నుండి 13.4960 క్యూసెక్కుల నీరు దిగువకు ప్రవహిస్తోంది. దిగువ గోదావరి ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. దీంతో పాజెక్టు కింద ఉన్న లోతట్టు ముంపు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. మత్సకారులు చేపల వేటకు గోదావరిలోకి వెళ్లకూడదని హెచ్చరికలు జారీ చేశారు. రాబోయే రెండు రోజులు జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ఎల్లో ఆలర్ట్‌ను ప్రకటించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News