Monday, October 14, 2024

బైంసాలో రోడ్డు ప్రమాదం..

- Advertisement -
- Advertisement -

20 Injured in RTC Bus Accident in Nirmal

నిర్మల్: జిల్లాలోని బైంసాలో రోడ్డు ప్రమాదం జరిగింది. సోమవారం మధ్యాహ్నం బైంసా మండలంలోని తిమ్మాపూర్ వద్ద జాతీయ రహదారిపై వేగంగా దూసుకొచ్చిన ఓ ఆర్టీసి బస్సు, ముందు వెళ్తున్న మరో ఆర్టీసి బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సుల్లో ప్రయాణిస్తున్న ప్రయాణికుల్లో 20మందికి పైగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని గాయపడినవారిని చికిత్స నిమిత్తం బైంసా ఏరియా ఆస్పత్రికి తరలించారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేయనున్నట్లు చెప్పారు.

20 Injured in RTC Bus Accident in Nirmal

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News