- Advertisement -
దక్షిణ ఇరాన్‌లో బస్సు బోల్తాపడి కనీసం 21 మంది మరణించారని ఇరాన్ మీడియా శనివారం పేర్కొంది. ఫార్స్ ప్రావిన్స్ అత్యవసర సంస్థ అధిపతి మసౌద్ అబేద్, దక్షిణ షిరాజ్ ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 34 మంది ఇతరులు గాయపడ్డారని వివరించారు. సహాయకచర్యలు కొనసాగుతున్నాయని కూడా ఆయన తెలిపారు. ఈ దుర్ఘటన ఉదయం 11.05కు జరిగిందని అబేద్ తెలిపారు. కాగా ప్రమాదానికి గల కారణం ఇంకా తెలియాల్సి ఉంది. పరిశోధన కొనసాగుతోంది.
- Advertisement -