Thursday, February 29, 2024

21,791 నకిలీ జిఎస్‌టి రిజిస్ట్రేషన్లు

- Advertisement -
- Advertisement -

రూ.24 వేల కోట్ల అనుమానిత పన్ను ఎగవేతలను గుర్తించాం
ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్

న్యూఢిల్లీ : దేశంలో పెద్ద మొత్తం నకిలీ జిఎస్‌టి(వస్తు, సేవల పన్ను) రిజిస్ట్రేషన్లను గుర్తించామని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతామన్ లోక్‌సభలో వెల్లడించారు. రెండు నెలల సుదీర్ఘ స్పెషల్ డ్రైవ్‌లో దాదాపు 21,791 నకిలీ జిఎస్‌టి రిజిస్ట్రేషన్లు, రూ.24 వేల కోట్ల అనుమానిత పన్ను ఎగవేతలను కనుగొన్నామని ఆమె తెలిపారు. నిజాయితీ పన్ను చెల్లింపుదారుల ప్రయోజనాలను కాపాడేందుకు, టాక్స్ పేయర్స్ తీవ్ర ఇబ్బందులు పడకుండా ఉండేందుకు పలు జాగ్రతలు పాటిస్తున్నామని అన్నారు. సమన్లు, ప్రాపర్టీ ప్రొవిజనల్ అటాచ్‌మెంట్, టాక్స్ క్రెడిట్ బ్లాకింగ్ వంటి అధికార విషయంలో జాగ్రత్త వహించాలని, సూచనలు రోజూ చేస్తున్నామని మంత్రి వివరించారు. మొత్తం 21,791 సంస్థలు కల్గివున్న జిఎస్‌టి రిజిస్ట్రేషన్ ఉనికిలో లేవని కనుగొన్నామని తెలిపారు.

గేమింగ్ కంపెనీలకు 71 షోకాజ్ నోటీసులు
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(202324)లో రూ.1.12 లక్షల కోట్లకు పైగా జిఎస్‌టి ఎగవేత ఆరోపణలకు గాను ఆన్‌లైన్ గేమింగ్ కంపెనీలకు 71 షోకాజ్ నోటీసులను జారీ చేశామని ఆర్థికమంత్రి తెలిపారు. అక్టోబర్ వరకు దాదాపు రూ.1.51 లక్షల కోట్ల జిఎస్‌టిని ఎగవేసిన 154 మందిని కేంద్ర జిఎస్‌టి అధికారులు అరెస్టు చేశారు. దీనిలో రూ.18,541 కోట్లను రికవరీ చేసినట్టు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News