Tuesday, May 14, 2024

ఎపి ఉద్యొగులకు 23శాతం ఫిటెమెంట్

- Advertisement -
- Advertisement -

23% fitment for AP Employees

రిటైర్మెంట్ వయసు 62కు పెంచుతూ సిఎం జగన్ ఆదేశాలు

మనతెలంగాణ/హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఎపి ఉద్యోగుల ఫిట్‌మెంట్‌ని 23శాతంగా ప్రకటించడంతో పాటు ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు 60 నుంచి 62 ఏళ్లకు పెంచుతూ శుక్రవారం నాడు నిర్ణయం తీసుకున్నారు. ఈక్రమంలో జనవరి 1, 2022 నుంచి పెంచిన కొత్త జీతాలు చెల్లిస్తామని, పిఆర్‌సి జూలై 1, 2018 నుంచి అమలు కానున్నట్లు తెలిపారు. మానిటరీ బెనిఫిట్ ఏప్రిల్ 1, 2020 నుంచి అమలు కానుందని, సిపిఎస్‌పై జూన్ 30లోగా నిర్ణయం తీసుకోనున్నామన్నారు. తాజా నిర్ణయంతో ప్రభుత్వంపై రూ.10,247కోట్ల అదనపు భారం పడనుందని, గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులందరికీ జూన్ 30లోగా ప్రొబేషన్, కన్ఫర్మేషన్ ప్రక్రియను పూర్తిచేసి, సవరించిన విధంగా రెగ్యులర్ జీతాలను (న్యూ పేస్కేలు) ఈ ఏడాది జులై జీతం నుంచి ఇవ్వనున్నట్లు తెలిపారు. సొంతిల్లు లేని ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వమే అభివృద్ధి చేస్తున్న జగనన్న స్మార్ట్ టౌన్‌షిప్స్‌లో – ఎంఐజి లే అవుట్స్‌లోని ప్లాట్లలో 10శాతం ప్లాట్లను రిజర్వ్‌చేయడమే కాకుండా 20శాతం రిబేటును ఇవ్వాలని నిర్ణయించినట్లు వివరించారు.

ఒక నియోజకవర్గాన్ని యూనిట్‌గా తీసుకుంటామని, ఉద్యోగులు ఎవ్వరికీ కూడా ఇంటిస్థలం లేదనే మాట లేకుండా చూస్తామని హామీ ఇచ్చారు. మంచి చేయాలనే తపనతోనే ప్రతి అడుగూ వేస్తున్నామని ఈ సందర్భంగా సిఎం జగన్ వెల్లడించారు. కొవిడ్, ఆర్థిక పరిస్థితుల కారణంగా ఆదాయం తగ్గిందన్న ఆయన అన్నీ పరిగణనలోకి తీసుకుని నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ఫిట్‌మెంట్ 14.29 శాతం కన్నా ఎక్కువ ఇచ్చే పరిస్థితి లేదని కమిటీ చెప్పిందని చెప్పారు. ఉద్యోగులకు మంచి చేయాలన్న ఆలోచనతోనే నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేశారు. సంక్షేమం, అభివృద్ధి సజావుగా సాగాలంటే ఉద్యోగుల పాత్ర ఉందని వ్యాఖ్యానించారు. కొవిడ్ కారణంగా మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు కారుణ్య నియామకాలు చేపడుతామని ఈ విషయంలో కట్టుబడి ఉన్నామని ఉద్ఘాటించారు. రాష్ట్రంలో జూన్ 30లోపు కారుణ్య నియామకాలన్నీ పూర్తి చేస్తామన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News