Friday, April 19, 2024

ఇటలీనుంచి వచ్చిన చార్టెడ్ విమానంలో 125 మందికి కరోనా

- Advertisement -
- Advertisement -

25 Passengers Of Chartered Flight From Italy Test Positive

అమృత్‌సర్: ఒమిక్రాన్ వ్యాప్తితో దేశంలో కరోనా మహమ్మారి మరోసారి కలకలం సృష్టిస్తోంది. తాజాగా విదేశాలనుంచి వచ్చిన ఓ విమానంలో వందమందికి పైగా ప్రయాణికులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడం గుబులు రేపుతోంది. ఇటలీనుంచి పంజాబ్‌లోని అమృత్‌సర్ విమానాశ్రయానికి వచ్చినఅంతర్జాతీయ చార్టెడ్ విమానంలో 125 మందికి కరోనా సాజిటివ్ నిర్ధారణ అయినట్లు విమానాశ్రయం డైరెక్టర్ వికె సేథ్ వెల్లడించారు. మిలన్‌నుంచి బయలు దేరిన ఈ విమానం మధ్యాహ్నం 1.30 గంటలకు అమృత్‌సర్ విమానాశ్రయం చేరుకుంది. విమానంలో 179 ప్రయాణికులున్నారు. అందులో 19 మంది చిన్నారులను మినహాయించి మిగతా వారికి కొవిడ్ పరీక్షలు నిర్వహించారు. పెద్ద సంఖ్యలో పాజిటివ్‌లు రావడంతో అప్రమత్తమైన అధికారులు వారిని క్వారంటైన్‌కు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో ఎయిర్‌పోర్టు ముందు అంబులెన్స్‌లు బారులు తీరాయి. మరో వైపు తమకు కరోనా పాజిటివ్ ఎలా వచ్చిందో అర్థం కావడం లేదని ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. ఇటలీనుంచి బయలు దేరే సమయంలో తమకు నెగెటివ్ వచ్చిందని, ఇప్పుడు పాజిటివ్ ఎలా వస్తుందని వారు ప్రశ్నిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News