Friday, April 26, 2024

2,64,202 కేసులు, 315 మరణాలు

- Advertisement -
- Advertisement -

2,64,202 Covid 19 cases in India

రోజువారీ పాజిటివిటీ 14.78 శాతం
ః కేంద్ర ఆరోగ్యశాఖ

న్యూఢిల్లీ: శుక్రవారం ఉదయం వరకు 24 గంటల్లో దేశంలో 2,64,202 కొవిడ్19 కేసులు, 315 మరణాలు నమోదయ్యాయి. గురువారంతో(2,47,417కేసులతో) పోలిస్తే 6.7 శాతం అధికంగా కేసులు నమోదయ్యాయి. కేసుల నమోదులో 239 రోజుల తర్వాత ఇదే గరిష్ఠం. దీంతో, శుక్రవారం యాక్టివ్ కేసుల సంఖ్య 12,72,073కు చేరింది. యాక్టివ్ కేసు రేట్ 3.48 శాతం. మొత్తం కేసుల సంఖ్య 3,65,82,129కి చేరింది. మరణాల సంఖ్య 4,85,350కి చేరింది. ఒమిక్రాన్ వేరియంట్ కేసుల సంఖ్య 5753కు చేరింది.

24 గంటల్లో 109,345మంది కోలుకున్నారు. దాంతో, కోలుకున్నవారి సంఖ్య 3,48,24,706కి చేరింది. రికవరీ రేట్ 95.20 శాతంగా, మరణాల రేట్ 1.33 శాతంగా నమోదైంది. రోజువారీ పాజిటివిటీ రేట్ 14.78 శాతంగా, వారం పాజిటివిటీ రేట్ 11.83 శాతంగా నమోదైందని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. గురువారం 17,87,457 మందికి పరీక్షలు నిర్వహించారు. దీంతో, మొత్తం పరీక్షల సంఖ్య 69.90 కోట్లకు చేరిందని ఐసిఎంఆర్ తెలిపింది. శుక్రవారం ఉదయం వరకు 155.39 కోట్ల డోసుల వ్యాక్సిన్ పంపిణీ అయింది. రాష్ట్రాల వద్ద ఇంకా 15.17 కోట్ల డోసుల వ్యాక్సిన్ నిల్వలున్నాయని కేంద్రం తెలిపింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News