పాకిస్తాన్‌తో ఉద్రిక్తతల నేపథ్యంలో దేశంలోని ఉత్తర ప్రాంతంలో 27 విమానాశ్రయాలను రెండురోజల పాటు మూసివేశారు. ఈ నెల 10వ తేదీ వరకూ ఇక్కడి నుంచి అన్ని రకాల విమానాల రాకపోకలు నిలిచిపోతాయని అధికారులు గురువారం తెలిపారు. దాదాపుగా మొత్తం మీద 430 విమానాల రాకపోకలు నిలిచిపొయ్యాయి. పాకిస్థాన్‌లోని ఉగ్ర శిబిరాలపై భారతీయ సేనలు ఆపరేషన్ సిందూర పేరిట విరుచుకుపడ్డాయి. దీనితో పాక్ సైన్యం మరింతగా రెచ్చిపోతోంది. భారతదేశంలోని పలు కీలక స్థావరాలపై దాడులకు యత్నిస్తోంది. ఈ క్రమంలోనే ముంందు జాగ్రత్త చర్యగా విమానాశ్రయాల మూసివేత జరిగింది. ప్రదాన విమానయాన సంస్థలు ఎయిరిండియా, ఇండిగో, ఆకాశ్ ఎయిర్, స్పైస్‌జెట్ తమ కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించాయి.
రద్దు అయిన విమాన సర్వీసుల వివరాలు వెలువరించారు. ప్రయాణికులకు తదుపరి రాకపోకల షెడ్యూల్‌ను పంపించారు. కాగా ప్రస్తుత నిర్ణయంతో మధ్య , పశ్చిమ భారత ప్రాంతాలలో కూడా రెండు రోజుల పాటు విమానాల రాకపోకలకు అంతరాయాలు ఏర్పడ్డాయి. ప్రయాణికులకు ఛార్జీల తిరిగి అప్పగింత లేదా తరువాతి తేదీలలో ప్రయాణాలకు అవకాశం కల్పించారు. పాక్ నుంచి ఏ క్షణంలో అయినా ఏ విధంగా అయినా సరిహద్దు రాష్ట్రాలలో దాడులకు వీలుంటుందని, ప్రత్యేకించి మిస్సైల్స్ డ్రోన్ల ముప్పు దాడులు ఉంటాయని ఇంటలిజెన్స్ వర్గాలు తెలిపాయి. దీనితో నిఘా, భద్రతా వ్యవస్థలను మరింత తీవ్రతరం చేశారు