Thursday, April 25, 2024

282 అస్థిపంజరాలు లభ్యం

- Advertisement -
- Advertisement -

282 Indian soldiers Skeletons found in Amritsar

వీరంతా తొలి స్వాతంత్య్ర సంగ్రామ వీరులు

చండీగఢ్ : పంజాబ్‌లోని అమృత్‌సర్ వద్ద జరిపిన తవ్వకాలలో 282 మంది భారతీయ జవాన్ల అస్థ్తిపంజరాలు దొరికాయి. 1857 నాటి చారిత్రక భారత ప్రప్రధమ స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొన్న జవాన్ల అస్థిపంజరాలు ఇవని నిర్థారించారు. ఈ తవ్వకాల వివరాలను పంజాబ్ యూనివర్శిటీ ఆంధ్రపాలజి విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ జెఎస్ శెష్రావర్ బుధవారం తెలిపారు. ఈ ప్రధమ స్వాతంత్య్ర యుద్ధానికి విశేష కారణం ఉంది. పంది మాంసం పూతల తూటాల పై తొడుగును నోటితో తీసివేసే పద్ధతిని భారత జవాన్లు వ్యతిరేకించారు.

ఇది తమ మనోభావాలకు భంగకరం అని తేల్చిచెప్పారు. ఈ క్రమంలో సిపాయిల విప్లవం చోటుచేసుకుంది. బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా అప్పటి జవాన్లు ఉద్యమించి ఈ క్రమంలో బ్రిటిష్ సైన్యంతో తలపడ్డారు. ఈ దశలో వీరు చనిపోయ్యారు. ఈ వీర సిపాయిల అస్తిపంజరాలను అజ్నాలాలోని ఓ ప్రార్థనా మందిరం అడుగున వెలుగులోకి వచ్చిన ఓ పురాతన బావిలో నుంచి ఇప్పుడు వెలికితీశారు. సిపాయిల విప్లవంలో బలి అయిన జవాన్ల అవశేషాలే ఇవని తెలిపే పలు సాక్షాధారాలు సశాస్త్రీయ రీతిలో దొరికినట్లు , ఇక్కడి నాణేలు, పతకాలు, డిఎన్‌ఎ అధ్యయయనాలు , ఇవి ఎప్పటి శారీరక అవశేషాలో తెలిపే పూర్వాపరాలు, ఆంథ్రాపాలజీ సంబంధిత అధ్యయనాలన్ని కూడా వీరు అప్పటి మృతవీరులు అనే విషయం తెలియచేస్తున్నాయని సెహ్రావత్ తెలిపారు. 1857 సిపాయిల విప్లవాన్ని కొందరు చరిత్రకారులు దేశ తొలి స్వాతంత్య్ర సమరంగా పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News