Saturday, July 27, 2024

జైపూర్‌లో అరగంటలో వరుసగా 3 భూకంపాలు

- Advertisement -
- Advertisement -

జైపూర్: రాజస్థాన్‌ రాజధాని జైపూర్‌లో శుక్రవారం తెల్లవారుజామున వరుసగా మూడు సార్లు భూమి కంపించింది. అరగంట వ్యవధిలోనే జైపూర్‌లో వరుసగా మూడుసార్లు భూప్రకంపనలు సంభవించాయి.

శుక్రవారం తెల్లవారుజామున 4.10 గంటలకు మొదటి భూకంపం సంభించింది. రిక్టర్ స్కేలుపైన దీని తీవ్రత 4.4గా నమోదైంది. భూమి కంపించడంతో ఇళ్లలో నిద్రిస్తున్న ప్రజలు ఉలిక్కిపడి లేచి ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు. రెండవసారి 3.1 తీవ్రతతో, మూడవ సారి 3.4 తీవ్రతతో భూప్రకంపనలు సంభివంచాయి. తెల్లవారుజాము 4.22 గంటలకు రెండవసారి, 4.25 గంటలకు మూడవసారి భూప్రకంపనలు సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ(ఎన్‌సిఎస్) వెల్లడించింది. జైపూర్‌లో భూమి లోపల 10 కిలోమీటర్ల దూరంలో భూకంపం కేంద్రీకృతమైనట్లు కేంద్రం తెలిపింది. అయితే, ఆస్తి, ప్రాణ నష్టం గురించి ఎటువంటి సమాచారం లేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News