Sunday, September 15, 2024

మేడ్చల్ జిల్లాలో రైలు ప్రమాదం..ముగ్గురు మృతి

- Advertisement -
- Advertisement -

మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాలో రైలు ప్రమాదం చోటుచేసుకుంది. మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గౌడవెల్లీ సమీపంలో రైలు ఢీకొని ముగ్గురు మృతి చెందారు. మృతులు పట్టణంలోని రాఘవేంద్ర నగర్ కాలనీకి చెందిన కృష్ణ, ఆయన ఇద్దరు కుమార్తెలు వర్ష, వర్షిణిగా గుర్తించారు. కృష్ణ రైల్వే లైన్‌మెన్‌గా పని చేస్తున్నాడు. ఆదివారం సెలవు దినం కావడంతో పిల్లలు ఆడుకుంటారనే ఉద్దేశ్యంతో తన వెంట తీసుకొచ్చాడు.

కృష్ణ ట్రాక్ పనుల్లో నిమగ్నమై ఉండగా, పిల్లలు ట్రాక్‌కు అటు ఇటు మారుతూ ఆడుకుంటున్నారు. అదే సమయంలో ట్రాక్‌పైకి రైలు రావడంతో వారిని కాపాడబోయి ఆయన ప్రాణాలు కోల్పోయాడు. అభం శుభం తెలియని చిన్నారులు ప్రాణాలు కోల్పోవడంతో అక్కడ విషాధచాయలు అలుముకున్నాయి. పిల్లల వయస్సు 5 నుండి 6 సంవత్సరాల మధ్య ఉంటుందని స్థానికులు చెప్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News