- Advertisement -
అమరావతి: మురళీనాయక్ కుటుంబానికి వ్యక్తిగత సాయం చేస్తానని ఎపి ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చానన్నారు. మురళీనాయక్ (Murali Nayak)కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందని అన్నారు. మురళీ నాయక్ పార్థివదేహానికి ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాన్ నివాళులర్పించారు. అనంతరం మురళీ నాయక్ కుటుంబ సభ్యులను ఓదార్చారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ..మురళీనాయక్ కుటుంబానికి రూ. 50 లక్షల ఆర్థిక సాయం చేస్తానని తెలిపారు. మురళీనాయక్ కుటుంబానికి ఐదెకరాలు, 300 గజాల ఇంటి స్థలం కేటాయించామని, మురళీనాయక్ కుటుంబానికి రూ.25 లక్షల వ్యక్తిగత సాయం చేస్తానని పవన్ హామీ ఇచ్చానని తెలియజేశారు. మురళీ కుటుంబానికి ఎలాంటి సాయం కావాలన్నా 3 పార్టీలు సిద్ధమని అన్నారు. మురళీ నాయక్ కుటుంబానికి భగవంతుడు ధైర్యం ఇవ్వాలని కోరుకుంటున్నానని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.
- Advertisement -