Wednesday, November 13, 2024

ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన బైక్.. ముగ్గురు స్పాట్ డెడ్

- Advertisement -
- Advertisement -

వికారాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.  పూడూరు గేటు వద్ద వేగంగా దూసుకొచ్చిన ఓ బైకు అదుపుతప్పి ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. గురువారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో బైక్ ప్రయాణిస్తున్న ముగ్గురు తీవ్రంగా గాయపడి మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతులను పూడూరు మండలం మేడికొండకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News