Monday, December 4, 2023

నాగర్ కర్నూల్ లో టిప్పర్ ఢీకొట్టడంతో 40 గొర్రెలు మృతి

- Advertisement -
- Advertisement -

టిప్పర్ ఢీకొట్టడంతో 40 గొర్రెలు మృతి…

మన తెలంగాణ/నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్ రూరల్ మండల పరిధిలోని అవు రాస్ పల్లి గేట్ సమీపంలో టిప్పర్ వాహనం ఢీకొట్టడంతో 40 గొర్లు మృతి చెందాయి. గురువారం బొందలపల్లి గ్రామానికి చెందిన దండు ఆంజనేయులు గొర్రెలను మేపుకొని సాయంత్రం ఇంటికి వెళుతున్న క్రమంలో గుడిపల్లి నుంచి నాగర్ కర్నూల్ వైపు కంకర లోడుతూ వేగంగా వస్తున్న టిప్పర్ రోడ్డుపై ఉన్న గొర్రెలను ఢీకొట్టడంతో దాదాపు 40 నుంచి 50 గొర్లు మృతి చెందాయి. దీంతో బాధితుడు తనకు న్యాయం చేయాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. స్థానికులు సమాచారం మేరకు పోలీసులు అక్కడికి చేరుకొని కేసు నమోదు చేసి టిప్పర్ ను పోలీస్ స్టేషన్ కు తరలించారు. గొర్రెల యజమానికి దాదాపుగా రూ.3.5 లక్షల నుంచి రూ.4.5 లక్షల మధ్య ఆర్థిక నష్టం ఏర్పడిందని గ్రామస్థులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News