Wednesday, October 9, 2024

4నెలలు, 4500 ఫోన్లు ట్యాప్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో పెను సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. పలువురు ముఖ్య నేతలే టార్గెట్ గా ఈ ఫోన్ ట్యాపింగ్ జరిగినట్టు తెలుస్తోంది. అప్పటి పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి, ఆయన సోదరులు, మిత్రులు, అనుచరుల ఫోన్లను, అలాగే బిజెపి ముఖ్య నేత ఈటెల రాజేందర్ ఫో న్‌తో పాటు, ఆయన గన్‌మెన్, పిఆర్‌ఓ, సెక్యూరిటీల ఫోన్లు ట్యాపింగ్ గురై నట్టు విచారణలో వెల్లడైంది. 4 నెలల్లో 4500 ఫోన్లను ట్యాప్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. వీరిలో 80% పైగా ఎయిర్ టెల్ కస్టమర్లు ఉన్నారు. ఎన్నికలకు 15 రోజుల ముందు కాంగ్రెస్ కు చెందిన 190 మంది ఫోన్లను ఈ కేసులో ప్రధాన నిందితుడు ప్రణీత్ రావు ట్యాప్ చే యించా రని వెల్లడైంది.

అనంతరం ట్యాప్ చేసిన 340 జిబికి చెందిన భారీ సమాచారాన్ని ధ్వంసం చేసినట్టు వెలుగులోకి వచ్చింది. మరోవైపు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం దర్యాప్తులో కీలక పురోగతి చోటు చేసుకుంది. ఈ కేసులో కీలక నిందితులుగా భావిస్తున్న స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ మాజీ ఒఎస్డీ ప్రభాకరరావు, మీడియా ఛానెల్ నిర్వాహకుడు అరువెల శ్రవణ్‌రావుకు రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసే దిశగా వేగంగా అడుగులు పడుతు న్నాయి. ప్రస్తుతం వీరిద్దరూ అమెరికాలో ఉన్నారని అనుమానిస్తున్న పోలీసులు వారిని హైదరాబాద్ తీసుకొచ్చేందుకు చేస్తున్న ప్రయత్నాలకు సిబిఐ అనుమతిచ్చింది. రెడ్ కార్నర్ నోటీసు కోసం హైదరాబాద్ పోలీసులు పంపిన నివేదికను సమ్మతించిన సిబిఐ ఇంటర్‌పోల్‌కు లేఖ రాసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News