Friday, May 23, 2025

దివ్యాంగులకు 4 శాతం ఇళ్ల కోటా

- Advertisement -
- Advertisement -

కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్య హౌసింగ్ స్కీంలో దివ్యాంగులకు 4 శాతం రిజర్వేషన్‌ను కల్పించారు. సమాజంలో ఈ వర్గాలు వెనుకబడకుండా ఉండేందుకు , వారి సమీకృత అభివృద్ధికి ఈ కోటాను ఖరారు చేశారు. ఏ విధమైన వికలాంగత ఉన్న వారికైనా ఇప్పుడు కల్పించే కోటాతో వారు సొంతింటి వారు కావడానికి అవకాశాలు మెరుగుపడుతాయి. వారిసాధికారికతకు దోహదం చేసినట్లు అవుతుందని గురువారం వెలువరించిన అధికారిక ప్రకటనలో తెలిపారు. దివ్యాంగుల చట్టం 2016 సంబంధిత హక్కులకు అనుగుణంగా కేంద్రం ఈ చొరవ తీసుకుందని వివరించారు. ప్రధాని మోడీ ప్రతిపాదిత సబ్ కా సాథ్, సబ్ కా వికాస్ సందేశం స్ఫూర్తిగా ఈ కోటా కల్పించారు. అన్ని వర్గాల ప్రజలకు సమాన అవకాశాల కల్పనకు కట్టుబడి ఉండేలా రూపొందించిన సుగమయ భారత్ అభియాన్‌లో భాగంగా వికలాంగులకు ఈ 4 శాతం కోటా ఏర్పాటు జరిగిందని హౌసింగ్ మంత్రిత్వశాఖ తమ ప్రకటనలో తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News