Wednesday, November 13, 2024

దివ్యాంగుల జాబ్‌ పోర్టల్‌ ఆవిష్కరించిన మంత్రి సీతక్క

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్‌: దివ్యాంగుల జాబ్‌ పోర్టల్‌ ను మంత్రి సీతక్క ఆవిష్కరించింది. మహిళా సంక్షేమ శాఖలో 10 మందికి మంత్రి నియామక ఉత్తర్వులు అందించారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ.. దివ్యాంగులు కంపెనీల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదని చెప్పారు. జాబ్‌ పోర్టల్‌లో రిజిస్టర్‌ చేసుకుంటే అర్హత ప్రకారం ఉద్యోగాలు వస్తాయని తెలిపారు.
సంక్షేమ నిధుల్లో ఐదు శాతం దివ్యాంగులకు కేటాయిస్తున్నామని మంత్రి చెప్పారు. దివ్యాంగులకు ప్రైవేట్‌ ఉద్యోగాల్లో 4 శాతం రిజర్వేషన్లతోపాటు ఇందిరమ్మ ఇళ్లు, ఇతర పథకాల్లో దివ్యాంగులకు రిజర్వేషన్లు అమలు చేయనున్నట్లు తెలిపారు. దివ్యాంగుల పరికరాల కోసం బడ్జెట్‌లో రూ.50 కోట్లు ఖర్చు చేస్తున్నామని మంత్రి సీతక్క చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News