Thursday, April 25, 2024

ఒడిశాలో రైళ్ల విలయం

- Advertisement -
- Advertisement -

బాలాసోర్/ హౌరా: బాలాసోర్ జిల్లా బహానాగ స్టేషన్ వద్ద శుక్రవారం జరిగిన మూడు రైళ్ల సం బంధిత ప్రమాదాల్లో కనీసం 50మంది మృతి చెందారు. 500 మందికి పైగా గాయపడ్డారు. ముందు ఈ దారిలోనే బెంగళూరు హౌరా సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ పట్టా లు తప్పింది. తరువాత హౌరా నుంచి చెన్నైకు వెళ్లుతు న్న కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ గూడ్స్ రైలును ఢీకొంది. వే ర్వేరు ట్రాక్‌లపై కొద్దిగంటల వ్యవధిలోనే ఈ మూడు యాక్సిడెంట్లు జరిగాయి. రైల్వే అధికారులు తెలిపిన వి వరాల ప్రకారం 12864 నెంబరు బెంగళూరు హౌరా సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ హౌరాకు వెళ్లుతుండగా పట్టాలు తప్పి బోగీలు పక్క ట్రాక్‌పై పడ్డాయి. ఈ బోగీలను అ టుగా వస్తున్న కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ ఢీకొనడంతో ఈ రైలు బోగీలు కూడా పట్టాలు తప్పాయి. ఈ దశలోనే ఈ రూట్లో వస్తున్న గూడ్స్ రైలు పట్టాలపై పడి ఉన్న బోగీలను ఢీకొంది.

ప్రత్యేకించి కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ బోగీలలో చాలా మంది ప్రయాణికులు చిక్కుపడ్డారు. ప్రమాదంపై రైల్వే మంత్రిత్వశాఖ ప్రతినిధి అమితాబ్ శర్మ ఢిల్లీలో విలేకరులకు తెలిపారు. ఈ ప్రమాదం గురించి చాలా సేపటివరకూ స్పష్టమైన సమాచారం వెలువడలేదు. ముందు గూడ్స్, రైలు ఎదురెదురుగా వచ్చినట్లు తెలిపారు. తరువాత మరో ప్రకటన వెలువరించారు. ప్రమాదం ఏ విధంగా జరిగిందనేది నిర్థారించుకునేందుకు దర్యాప్తు చేపట్టారు. ఘటనపై ఒడిషా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ స్పందించారు. జిల్లా అధికారులు ఘటనా స్థలికి వెళ్లి పరిస్థితిని సమీక్షించాలని ఆదేశించారు. ఘటనపై రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మూ, ప్రధాని మోడీ వేర్వేరు ప్రకటనలలో సంతాపం తెలిపారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ ఈ ఘటనపై దిగ్భ్రాం తి వ్యక్తం చేశారు. తమ రాష్ట్రం నుంచి కూడా సహాయక బృందాలను తరలిస్తున్నట్లు వెల్లడించారు.
సిఎం కెసిఆర్ సంతాపం
ఒడిశా రాష్ట్రం లోని బాలాసోర్ జిల్లా బహానగర్ రైల్వే స్టేషన్ సమీపంలో, కోరమాండల్ ఎక్స్ ప్రెస్ రైలు ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇది అత్యంత దురదృష్టకర సంఘటన అని విచారం వ్యక్తం చేశారు. ఈప్రమాదంలో పలువురు మృత్యువాత పడడం, మరెందరో తీవ్ర గాయాల పాలుకావడంపై ఆవేదన వ్యక్తం చేశారు. మరణించిన వారి కుటుంబాలకు సిఎం తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని, ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలను రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు వారికి భరోసాను కల్పించాలని సిఎం కెసిఆర్ కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News