Tuesday, October 15, 2024

‘6 జర్నీ’ టీజర్ విడుదల

- Advertisement -
- Advertisement -

పాల్యం శేషమ్మ, బసిరెడ్డి సమర్పణలో అరుణ కుమారి ఫిలింస్ బ్యానర్‌పై రూపొందుతున్న చిత్రం ‘6 జర్నీ’. రవిప్రకాష్ రెడ్డి, సమీర్ దత్త, పల్లవి, టేస్టి తేజ రమ్యా రెడ్డి తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. బసీర్ అలూరి దర్శకత్వంలో పాల్యం రవి ప్రకాష్ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సెన్సార్ కార్యక్రమాలకు సిద్ధమైన ఈ సినిమాను త్వరలోనే విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ మూవీ టీజర్‌ను పటేల్ రమేష్ రెడ్డి విడుదల చేశారు.

ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో దర్శకుడు బసీర్ మాట్లాడుతూ “రవి ప్రకాష్ రెడ్డి ఈ మూవీని ముందుండి నడిపించారు. మా హీరోయిన్లు అద్భుతంగా నటించారు. టేస్టి తేజ ఎనర్జీతో నటించాడు”అని అన్నారు. నిర్మాత రవి ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ.. “ఈ సినిమాను నిర్మించడం, ఇందులో నటించడం ఆనందంగా ఉంది. సినిమా అద్భుతంగా వచ్చింది. టీజర్ అందరికీ నచ్చేలా ఉంది. చిత్రం కూడా అందరికీ నచ్చుతుంది”అని తెలిపారు. ఈ కార్యక్రమంలో సమీర్ దత్తా, పల్లవి, రమ్యా రెడ్డి, అవంతిక, టేస్టి తేజ పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News