Thursday, June 13, 2024

6వ దశలో 63.37 శాతం పోలింగ్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల ఆరవ దశలో 63.37 శాతం పోలింగ్ నమోదైందని ఎన్నికల కమిషన్ మంగళవారం వెల్లడించింది. అర్హులైన మొత్తం ఓటర్ల సంఖ్య 11.13 కోట్లు కాగా 7.05 కోట్ల మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నట్లు ఇసి తెలిపింది. మే 25న ఆరవ దశలో 8 రాష్ట్రాలలోని 58 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ జరిగింది. మొదటి ఆరు దశలలో జరిగిన పోలింగ్‌లో అర్హులైన ఓటర్లు 87.54 కోట్లు ఉండగా దాదాపు 57.77 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ప్రపంచంలోనే అత్యధికంగా భారత్‌లో 96.88 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. 2019 సార్వత్రిక ఎన్నికలలో ఆరవ దశలో 7 రాష్ట్రాలలోని 59 స్థానాలకు ఎన్నికలు జరగగా 64.4 శాతం ఓటింగ్ నమోదైంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News