Tuesday, October 15, 2024

కోట గోడ కూలి ఏడుగురి మృతి

- Advertisement -
- Advertisement -

భారీ వర్షం కారణంగా 400 సంవత్సరాల పురాతన కోట గోడ ఇంటిపై కూలడంతో ఏడుగురు వ్యక్తులు మరణించారు. మధ్యప్రదేశ్‌లోని దాటియా పట్టణంలో గురువారం ఈ దుర్ఘటన జరిగింది. ఖల్కపురా ప్రాంతంలో తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు అధికారి ఒకరు తెలిపారు. కోట గోడ పక్కనే ఉన్న ఇంటిపై పడిపోవడంతో ఆ ఇంటో నివసిస్తున్న 9 మంది శిథిలాల కింద చిక్కుకున్నారు.

వారిలో ఇద్దరిని రక్షించగా ఏడుగురు మరణించారని దాటియా జిల్లా కలెక్టర్ సందీప్ మకిన్ తెలిపారు. రాజ్‌గఢ్ అని పిలిచే ఈ కోట 400 ఏళ్ల క్రితం నాటిది. ఒకప్పుడు ఇందులో మూజియం ఉండేది. కొంతకాలం క్రితం మ్యూజియంను వేరే చోటుకు తరలించారని స్థానికుడు తెలిపారు. మృతులలో ఐదుగురు ఒకే కుటుంబానికి చెందినవారు కాగా ఇద్దరు వేరే కుటుంబానికి చెందినవారని కలెక్టర్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News