Sunday, July 20, 2025

లిఫ్ట్‌లో పడి వృద్ధుడి మృతి

- Advertisement -
- Advertisement -

లిఫ్ట్‌లో పడి వృద్ధుడు మృతిచెందిన సంఘటన నగరంలోని బాబు ఖాన్ ఎస్టేట్‌లో శనివారం ఉదయం చోటుచేసుకుంది. బీహార్ రాష్ట్రానికి చెందిన బాలాజీ(70) బాబుఖాన్ ఎస్టేట్‌లో వాచ్‌మెన్‌గా పనిచేస్తున్నాడు. రోజు మాదిరిగానే విధుల్లో ఉన్న బాలాజి ఉదయం లిఫ్ట్‌లో వెళ్లేందుకు బటన్ నొక్కాడు. కానీ లిఫ్ట్ రాకముందే డోర్లు ఓపెన్ కావడంతో లిఫ్ట్ వచ్చిందని భావించిన బాధితుడు ముందుకు వెళ్లడంతో ఒక్కసారిగా లిఫ్ట్ కిందపడడంతో అక్కడి కక్కడే మృతిచెందాడు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News