Saturday, August 16, 2025

క్రికెటర్ల స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు

- Advertisement -
- Advertisement -

ముంబై: భారత 79వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని టీమిండియా ప్రస్తుత, మాజీ క్రికెటర్లు దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. భారత వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి, టి20 సారథి సూర్యకుమార్ యాదవ్, టెస్టు కెప్టెన్ శుభ్‌హన్ గిల్, టీమిండియా ప్రధాన కోచ్ గౌతం గంభీర్, ఐసిసి అధ్యక్షుడు జైషా, మాజీ క్రికెటర్లు సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ, ఇర్ఫాన్ పఠాన్, వీరేంద్ర సెహ్వాగ్, కపిల్ దేవ్ తదితరులు సోషల్ మీడియా వేదికగా దేశ ప్రజలకు ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలను తెలిపారు. ఈ మేరకు వీరు సోషల్ మీడియాలో పోస్ట్‌లను పెట్టారు. గంభీర్, సచిన్ తదితరులు జై హింద్ అంటూ ట్విట్ చేశారు. ఇక రోహిత్ శర్మ పెట్టిన పోస్ట్ వైరల్‌గా మారింది. గతేడాది భారత్ టి20 వరల్డ్‌కప్ గెలిచిన సంగతి తెలిసిందే. అప్పుడు రోహిత్ శర్మ బార్బడోస్ మైదానంలో భారత జెండాను రెపరెపలాడించాడు. తాజాగా ఆ ఇమేజ్‌ను పోస్టు చేసి అభిమానులకు, దేశ ప్రజలకు స్వాతంత్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News