Friday, September 20, 2024

షాకింగ్.. శంషాబాద్‌లో ఏకంగా 8 క్వింటాళ్ల గంజాయి సీజ్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్‌: గంజాయిపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నా.. ఐ డోంట్ కేర్ అంటున్నారు గంజాయి స్మగ్లర్లు. పోలీసుల కళ్లు కప్పి భారీగా గంజాయిని ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి సరఫరా చేస్తున్నారు. ఈ క్రమంలో సైబరాబాద్ ఎస్ఓటి పోలీసులు భారీగా గంజాయిని పట్టుకున్నారు. 800 కేజీల గంజాయిని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.

ఆదివారం రాత్రి శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు పెద్ద గోల్కొండ సమీపంలో ఎస్ఓటి పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా.. అనుమానాస్పదంగా కనిపించిన ఓ కంటైనర్ లారీని ఆపి చెక్ చేయడంతో ఏకంగా 8 క్వింటాళ్ల గంజాయి చూసి షాకయ్యారు. దీంతో కంటైనర్ సీజ్ చేసి డ్రైవర్ ను అదుపలోకి తీసుకున్నారు. ఒడిశా నుంచి గంజాయి తరలిస్తున్న దాదాపు రూ. 3 కోట్ల విలువ చేసే గంజాయిని పట్టుకున్నట్లు సైబరాబాద్ ఎస్ఓటి పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News