Friday, May 24, 2024

ట్రక్కును గూడ్స్ వాహనం ఢీకొని 9 మంది మృతి

- Advertisement -
- Advertisement -

ఛత్తీస్‌గఢ్ బెమెతారా జిల్లాలో 32 మందితో వెళుతున్న గూడ్స్ వాహనం ఒక ట్రక్కును ఢీకొన్న ప్రమాదంలో ఆరుగురు మహిళలు, ముగ్గురు పిల్లలు మరణించినట్లు, మరి 23 మంది గాయపడినట్లు పోలీసులు సోమవారం వెల్లడించారు. పథర్రా గ్రామ వాసులైన ఆ 32 మందీ తిరైయ్యా గ్రామంలో ఒక కుటుంబ వేడుకకు హాజరై తిరిగి వస్తుండగా కథియా గ్రామం సమీపంలో ఆదివారం రాత్రి పొద్దుపోయిన తరువాత ఈ ప్రమాదం సంభవించిందని పోలీస్ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. రోడ్డు పక్కన ఆగి ఉన్న ట్రక్కును గూడ్స్ పికప్ వాహనం ఢీకొన్నదని ఆయన చెప్పారు.

తీవ్రంగా గాయపడిన ముగ్గురు వ్యక్తులను రాయిపూర్‌లోని అఖిల భారత వైద్య శాస్త్రాల సంస్థ (ఎయిమ్స్)లోను, మరొకరిని మరొక ఆసుపత్రిలోను చేర్పించినట్లు ఆయన తెలిపారు. ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి విష్ణు దేవ్ సాయి ఈ ప్రమాదంపై తీవ్ర విచారం వెలిబుచ్చారు. రాష్ట్ర మంత్రి దయాళ్‌దాస్ బఘెల్, బిజెపి సిట్టింగ్ ఎంపి, దుర్గ్ లోక్‌సభ అభ్యర్థి విజయ్ బఘెల్ పథర్రా గ్రామాన్ని సందర్శించి బాధితుల కుటుంబ సభ్యులను పరామర్శించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News