Tuesday, April 30, 2024

దాసరి బయోపిక్‌కు సన్నాహాలు

- Advertisement -
- Advertisement -

Dasari biopic Movies

సినీరంగంలో బహుముఖ ప్రజ్ఞాశాలిగానే కాదు అన్నింటా తానై, అందరివాడుగా వెలుగొందిన దివంగత దర్శకరత్న దాసరి నారాయణరావు గురించి ఎంత చెప్పినా తక్కువే. అలాంటి అరుదైన వ్యక్తి జీవితం ఇప్పుడు వెండితెరకెక్కబోతోంది. ‘దర్శకరత్న’ పేరుతో ఆయన జీవితంలోని సంఘటనల సమాహారంతో రూపొందబోయే ఈ చిత్రాన్ని త్వరలో ప్రాంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇమేజ్ ఫిలింస్ పతాకంపై ధవళ సత్యం దర్వకత్వంలో తాడివాక రమేష్ నాయుడు నిర్మించే ఈ చిత్రం ముందస్తు నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.

ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటైన విలేకరుల సమావేశంలో చిత్ర యూనిట్ తో పాటు పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దర్శకుడు ధవళసత్యం మాట్లాడుతూ “చిత్ర పరిశ్రమలో మేరు శిఖరం అంత ఎత్తుకు ఎదిగి, రచయితగా, దర్శక, నిర్మాతగా ఎందరెందరికో మార్గదర్శకుడైన దాసరితో నాకున్న విడదీయలేని అనుబంధం ఈ చిత్రం చేసేందుకు నన్ను పురిగొల్పింది.

దాంతో నాకు తెలిసిన, ఆయన జీవితంలో నేను చూసిన అనేక సంఘటనలతో పాటు, ఆయనతో అనుబంధం ఉన్న అనేకమందిని సంప్రదించి ఈ చిత్రం స్క్రిప్ట్‌ను అద్భుతంగా రూపకల్పన చేయడం జరుగుతోంది. దీనిని ఓ గొప్ప చిత్రంగా తెరకెక్కించేందుకు తాడివాక రమేష్ నాయుడు ముందుకు రావడం అభినందనీయం”అని అన్నారు. చిత్ర నిర్మాత తాడివాక రమేష్ నాయుడు మాట్లాడుతూ “జాతీయ స్థాయి నటుడు ఈ చిత్రంలోని దాసరి పాత్రను పోషిస్తారు. అలాగే దాసరి పద్మ పాత్రలో గుర్తింపు ఉన్న నటి నటిస్తారు. తెలుగు, హిందీ, తమిళ వంటి ఇండియాలోని పలు భాషలలో ఓ పాన్ ఇండియా సినిమాగా ఎక్కడా రాజీ పడకుండా దీనిని రూపొందిచనున్నాం”అని చెప్పారు. ఈ సమావేశంలో సీనియర్ సంపాదకులు రామచంద్రమూర్తి, రేలంగి నరసింహారావు, ప్రసన్నకుమార్, మోహన్ వడ్లపట్ల, కాశీ విశ్వనాధ్, ఖాజా సూర్యనారాయణ, పి.రామకృష్ణగౌడ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News