Tuesday, April 30, 2024

కరోనా చికిత్సకు సర్వం సిద్ధం

- Advertisement -
- Advertisement -

వచ్చే ఏడాది గూడెం మెడికల్ కళాశాల ప్రారంభం
కలెక్టరేట్ ప్రారంభానికి మార్చిలో కొత్తగూడెంకు సిఎంను ఆహ్వానిస్తాం
ధళిత బంధు కోసం నియోజకవర్గానికో ప్రత్యేక అధికారి
రవాణా శాఖ మంత్రి పువ్వాడ

మన తెలంగాణ/కొత్తగూడెం : కరోనా వ్యాధి చికిత్సలు నిర్వహణకు జిల్లా యంత్రాంగం సర్వం సన్నద్ధంగా ఉందని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ తెలిపారు. బుధవారం నూతన కలెక్టరేట్ భవనంలో కోవిడ్‌నియంత్రణ చర్యలు, వ్యాక్సినేషన్, దళితబంధు, నూతన కలెక్టరేట్, మాతాశిశు ఆరోగ్య కేంద్రం, వైద్య, నర్శింగ్ కళాశాలల నిర్మాణ పనులు, ధన్యాం కొనుగోళ్లు తదితర అంశాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కోవిడ్ నియంత్రణ చర్యల్లో భాగంగా ఇంటింటి సర్వే నిర్వహించి లక్షణాలున్న వ్యక్తులను హోం ఐసోలేషన్ కిట్లు అందజేయాలన్నారు. రెండో విడతరలో సిఎం దివ్యమైన ఆలోచనతో ఇంటింటి సర్వేలో హోం ఐసోలేషన్ కిట్లు పంపిణి సంజీవనిగా పని చేసిందన్నారు. ఈ కార్యక్రమాన్ని ఐసిఎంఆర్ సైతం అభినందించిందని వివరించారు. ఈ కిట్ల పంపిణీ వల్ల వ్యాధి వ్యాప్తిని నిరోధించగలిగామన్నారు. తక్కుల వ్యాక్సినేషన్ అయిన మండలాల్లో ప్రత్యేక అధికారులను నియమించి ఈ నెలఖరునాటికి వ్యాక్సినేషన్ పూర్తీ అయ్యేటట్లు ప్రజా ప్రతినిధులను భాగస్వాములను చేయాలన్నారు. 15-17 సంవత్సరాల వయస్సున 55201 మందికి ఆగాను 39579 మందికి వ్యాక్సిన్ ఇచ్చినట్లు వివరించారు.

కళాశాలలు ప్రారంభమయ్యేనాటికి నూటికి నూరుశాతం వ్యాక్సినేషన్ పూర్తీ చేయాలన్నారు.వైద్య సిబ్బంది అంకిత భావం వల్ల గిరిజన జిల్లా అయినప్పటికి ప్రజల నూరుశాతం పూర్తీ చేయడం పట్ల ప్రజాప్రతినిధులను, కలెక్టర్, వైద్య సిబ్బందిని అభినందించారు. ఇదే స్పూర్తిని రెండో డోస్, 15-17—–సంవత్సరాల వయస్కులకు వ్యాక్సినేషన్, బూస్టర్ డోస్ పూర్తీ చేయాలన్నారు. బూస్టర్ డోస్‌లో మన జిల్లా ప్రధమ స్ధానంలో ఉందన్నారు. లక్షణాలున్న ప్రతి వారు పరీక్షలు చేయించకోవాలని, హోం కిట్లు పుష్కలంగా ఉన్నాయన్నారు. ప్రతి ఒక్కరు స్వీయ నియంత్రణ పాటించాలన్నారు. కొత్తగూడెం , మణుగూరు, భద్రాచలం ఆస్పత్రుల్లో అత్యవసర వైద్య సేవల నిర్వహణ కు ఆక్సిజన్ బెడ్లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అన్ని ప్రాధమిక ఆరోగ్యకేంద్రాల్లో అత్యవసర వైద్య సేవల నిర్వహణకు ఆక్సిజన్ కాన్‌సెంట్రేటర్లు అందుబాటులో ఉంచామన్నారు. పరిస్థితి విషమంగా ఉన్న వ్యక్తులను తక్షణమే ప్రధాన ఆస్పత్రులకు తరలించి వైద్య సేవలకు సంసిధ్దంగా ఉన్నామన్నారు. రెండెసీవర్ ఇంజక్షన్లు కూడా అందుబాటులోఉన్నాయన్నారు. దళిత బంధు పథకం గురించి మాట్లాడుతూ దళితుల అభివృద్ధికి చేపట్టిన ఈ కార్యక్రమం జిల్లాలో విజయవంతంగా నిర్వహించాలని చెప్పారు. లబ్ధిదార్ల ఎంపిక ప్రక్రియలో ఎంఎల్‌ఏలో సహకారం తీసుకోవాలన్నారు.

పర్యవేక్షణకు నియోజకవర్గానికి ప్రత్యేక అధికారులను నియమించినట్లు తెలిపారు. ఖమ్మం జిల్లా చింతకాని, హుజూరాబాద్ నియోజకవర్గంలో కార్యక్రమం అమలు తీరును పరిశీలించడానికి ప్రత్యేక అధికారులను పంపాలని మంత్రి సూచించారు. ఈ పధకం కింద నియోజకవర్గానికి వంద మందిని ఎంపిక చేసి పారిశ్రామిక వేత్తలుగా తయారు చేయనున్నట్లు చెప్పారు. ఫిబ్రవరి మొదటివారం వరకు లబ్ధిదార్ల ఎంపిక పూర్తీ చేయనున్నట్లు తెలిపారు. జాప్యం జరగటానికి వీల్లేదన్నారు. కార్యక్రమం విజయవంతం కావడంతో ప్రత్యేక అధికారుల ప్రధామని, ప్రస్తుతం 500 యూనిట్లు నెలకొల్సాల్సి ఉందని వారి కాళ్ల మీద వారు నిలబడి ఎదిగేందుకు చేపట్టిన ఈ కార్యక్రమం సవాలుగా తీసుకుని విజయవంతం చేయాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పథకం అమలుకు రూ.20 వేల కోట్లు కేటాయించనున్నట్లు పువ్వాడ వివరించారు. లబ్ధిదార్లు ఒకేరకమైన యూనిట్లు నెలకొల్పకుండా వివిధ రకాల యూనిట్లు నెలకొల్పుటకు అవగాహన కల్పించాలన్నారు. నిధు ల మంజూరుకు ఇప్పటికే కలెక్టర్ పేరుతో ఖాతా ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఎంపిక చేసిన లబ్ధిదార్ల బ్యాంకు ఖాతాలకు నేరుగా నగదు జమ చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. ఎంపిక చేసిన లబ్ధిదార్లు సమూహంగా ఏర్పడి పెద్ద యూనిట్లు ఏర్పాటుకు అవకాశం ఉన్నదన్నారు.

156 ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా 95లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామన్నారు. రూ.185 కోట్లకు గాను ఇప్పటికి రూ.100 కోట్లు చెల్లింపులు పూర్తీ చేశామన్నారు. ఈనెలాఖరు నాటికి ధాన్యం కొనుగోలు పూర్తీ చేయాలని ఆదేశించారు. రానున్న విద్యాసవంత్సరంలో వైద్య తరగతులు నిర్వహణ చేపట్టనున్నందున 300పడకలు ఏర్పాటు ప్రక్రియను పూర్తీ చేయాలన్నారు. మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో 100, ప్రధాన ఆస్రత్రిలో 240 పడకలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. మార్చిలో మెడికల్ కౌన్సిల్ విజిట్ ఉన్నందున ఫిబ్రవరి 15వ తేదీ నాటికి పనులు పూర్తీ అప్పగించాలన్నారు. నీటి, విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా ఏర్పాట్లు చేయాలని చెప్పారు. మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో సెంట్రల్ ఆక్సీజన్ సిస్టం ద్వారా ప్రతి బెడ్‌కు ఆక్సీజన్ అందించేందుకు ప్రతిపాదనలు అందజేయాలని చెప్పారు. ఆస్పత్రి నుంచి ప్రధాన రహదారి వరకు విద్యుత్ ఏర్పాట్లు చెప్పారు. ఫిబ్రవరి మొదటివారంలో ఆస్పత్రి ప్రారంభానికి ఏర్పాటు చేయాలన్నారు.

ఇంటిగ్రేటెడ్ ఆఫీసర్స్ కాంప్లెక్స్ (ఐడిఓసి)ని ర్మాణ పనులను మార్చి 15 వరకు పూర్తీ చేసి అప్పగించాలన్నారు. కలెక్టరేట్ కాంప్లెక్స్‌లో నిర్మిస్తొన్న కలెక్టర్, అదనపు కలెక్టర్, ఎనిమి మంది జిల్లా అధికారుల సముదాయాలను కూడా పూర్తీ చేయాలన్నారు. ప్రారంభోత్సవానికి ఆహ్వానించను న్నట్లు ఆయన తెలిపారు. కలెక్టర్ అనుదీప్ మాట్లాడుతూ భద్రాద్రిజిల్లాను మోడల్ జిల్లాగా తీర్చిదిద్దుతామన్నారు. దళితబంధు కోసం ప్రత్యేక అధికారులను నియమించినట్లు తెలిపారు. కొత్తగూ డెంకు డిఆర్‌డిఏ పిడి మధుసూధనరాజు, ఇల్లందుకు ఉద్యానవన అధికారి మరియన్న, భద్రాచలంకు సహకార అధికారి వెంకటేశ్వర్లు, పినపాకకు ఇరిగేషన్ అధికారి రాంప్రసాధ్, అశ్వారావుపేటకు పరిశ్రమల శాఖ జిఎం వైరాకు ఆర్‌అండ్‌బి ఈఈ భీంలాను ఆయా నియోజకవర్గాలకు ప్రత్యేక అధికారులుగా నియమించామన్నారు. ఈ సమావేశంలో విప్ రేగా కాంతారావు, జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య, అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చానాగేశ్వరరావు, మునిసిపల్ ఛైర్ పర్సన్ కాపుసీతాలక్ష్మీ, జడ్పీవైస్ ఛైర్మన్ కంచర్లచంద్రశేఖరరావు, డిసిఎంఎస్ వైస్ ఛైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు, గ్రంధాలయ సంస్ధ ఛైర్మన్ దిండిగాల రాజేందర్, జిలా అధికారులు, కౌన్సిలర్లు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News