Sunday, May 5, 2024

అరుదైన చేపకు రూ.4.30 లక్షల ధర

- Advertisement -
- Advertisement -

4.30 lakh for a rare fish in Kakinada

కాకినాడలో భారీ ధరకు అమ్ముడుపోయిన కచ్చిడి మగ రకం చేప
ఆనందం వ్యక్తం చేస్తున్న మత్సకారులు

కాకినాడ : తూర్పు గోదావరి జిల్లా కాకినాడ మత్స్యకారుల వలకు ఓ అరుదైన చేప చిక్కింది. 30 కిలోలకుపైగా బరువు ఉండే కచ్చిడి మగ రకం చేప చిక్కడంతో మత్స్యకారులు ఎగిరి గంతులేశారు. దాని కడుపులో ఉండే బ్లాడర్‌కు మంచి గిరాకీ ఉంటుంది. దీన్ని ఔషధాల తయారీలో ఉపయోగిస్తుంటారని చెబుతుంటారు. దీంతో ఈ చేపను కొనేందుకు పలువురు వ్యాపారులు ఆసక్తి చూపారు. చివరకు ఈ చేప ఏకంగా రూ.4.30 లక్షలకు అమ్ముడుపోయింది. మూడు రోజుల క్రితం కాకినాడ తీర ప్రాంత మత్సకారులు సముంద్రంలోకి వెటకు వెళ్లారు.

కాగా, శనివారం రాత్రి వీరి వలకు అరుదైన కచ్చిడి మగ రకం చేప చిక్కింది. దీంతో వీరు ఆదివారం ఉదయం కాకినాడ చేపల మార్కెట్‌లో ఈ చేపను అమ్మకం పెట్టగా.. స్థానికంగా ఉండే హోల్‌సేల్ వ్యాపారులు ఈ చేపకు ఏకంగా రూ.4.30 లక్షలకు సొంతం చేసుకున్నారు. అరుదుగా దొరికే కచ్చిడి మగ రకం చేపను థాయిలాండ్, వియాత్నం, సింగపూర్ తదితర దేశాల్లో మందుల్లో ఉపయోగిస్తారు. కాగా, ఈ జాతికి చెందిన ఆడ చేపకు ఈ స్థాయిలో గిరాకి ఉండే అవకాశాలు లేవని మత్సకారులంటున్నారు. కాగా, కాకినాడతో ఈ చేప ఇంత ధర పలకడం ఇదే తొలిసారని మత్స్యకారులు చెప్పారు. భారీ ధరకు ఆ చేప అమ్ముడుపోయినందుకు మత్సకారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News