Wednesday, May 15, 2024

పెరిగిన పాల సేకరణ ధరలు

- Advertisement -
- Advertisement -

Increased Vijaya Dairy milk collection prices

లీటర్ గేదె పాలపై రూ.4.68, ఆవుపాలపై రూ.2.88 ధర పెంపు
పెంచిన ధరలు ఈ నెల 16 నుంచి అమలు

పెరిగిన పాల సేకరణ ధరలు
(మొదటిపేజీ తరువాయి )
ధరలను మీడియాకు వెల్లడించారు. లీటరకు గేదె పాలపైన రూ. 4.68, ఆవుపాలపైన రూ.2.88 పెంచినట్టు వెల్లడించారు. పెంచిన పాల ధరలను ఈ నెల 16నుంచే పాడిరైతులకు వర్తింప చేయనున్నట్టు ప్రకటించారు. పాడి పరిశ్రమ రంగం అభివృద్ధి కి తెలంగాణ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని, పాడి రైతులను ప్రోత్సహించేలా అనేక కార్యక్రమాలను అమలు చేస్తుందని తెలిపారు. ప్రభుత్వ రంగంలోని తెలంగాణ విజయ డెయిరీకి పాలు పోస్తున్న పాడి రైతులకు ప్రభుత్వం ఎంతో చేయూతను అందిస్తుందన్నారు.

సిఎం ఆదేశాలతో తెలంగాణ విజయ డెయిరీ రైతుల నుండి సేకరిస్తున్న గేదె, ఆవు పాల ధరలను పెంచడం జరిగిందని వివరించారు. పెంచిన పాల సేకరణ ధరలు రైతులకు గొప్ప శుభవార్త అని ఆయన పేర్కొన్నారు. పెంచిన ధరలతో గేదె పాలు రూ.36.99 నుండి .41.64 రూపాయలకు , ఆవుపాల ధర రూ.29.76 నుండి 32.64 రూపాయలకు పెంచడం జరిగిందని వివరించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు నష్టాలలో ఉన్న విజయ డెయిరీ సంస్థ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రత్యేక చొరవ తో 700 కోట్ల రూపాయల టర్నోవర్ స్థాయికి చేరుకుందన్నారు. విజయ డెయిరీ నుండి ప్రస్తుతం ఉత్పత్తి చేస్తున్న పాలు, పాల ఉత్పత్తులకు అదనంగా నాణ్యమైన నూతన ఉత్పత్తులను మార్కెట్ లోకి తీసుకొచ్చే లక్ష్యంతో రంగారెడ్డి జిల్లా రావిర్యాల్ గ్రామ పరిధిలో 40 ఎకరాల విస్తీర్ణంలో అత్యాధునిక టెక్నాలజీతో రూ.246 కోట్ల వ్యయంతో మెగా డెయిరీ ని నిర్మించడం జరుగుతుందని వివరించారు. విజయ డెయిరీ కి పాలు పోసే పాడి రైతులను ప్రోత్సహించాలనే ఆలోచనతో లీటర్ పాలకు 4 రూపాయల ప్రోత్సాహకం ను అందజేసే కార్యక్రమాన్ని నవంబర్ 2014లోనే ప్రారంభించామన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News