Friday, May 3, 2024

ముస్లిం మహిళల ఉన్నత విద్య నమోదులో తెలంగాణ టాప్

- Advertisement -
- Advertisement -

Telangana tops in higher education enrollment for Muslim women

 

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో ఉన్నత విద్య ప్రవేశాలలో ముస్లీం మహిళల నమోదు క్రమంగా పెరుగుతోంది. పదేళ్లలో ఉన్నత విద్య, పాఠశాల విద్యలో ముస్లీం మహిళల ప్రవేశాలు గణనీయంగా పెగినినట్లు అఖిల భారత స్థాయిలో ఉన్నత విద్యపై నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. దేశంలో ఉన్నత విద్యలో ముస్లీం మహిళల నమోదులో తెలంగాణ రాష్ట్రం నెంబర్‌వన్‌గా నిలువగా, పాఠశాల విద్యలో ముస్లీం బాలికల నమోదులో రాష్ట్రం మూడవస్థానంలో నిలిచింది. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, హర్యానా రాష్ట్రాలు చివరి స్థానంలో ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మైనార్టీలకు విద్యను అందించేందుకు రాష్ట్రంలో మైనార్టీ గురుకులాలు ఏర్పాటు చేయడం, మైనార్టీ స్కాలర్‌షిప్‌లు అందించడం, షాదీ ముబారక్ పథకాల అమలుతో ముస్లీం మహిళలు ఉన్నత చదువులు చదువుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఉన్నత విద్య లో ముస్లీం మహిళల నమోదు రెట్టింపు అయ్యిం ది. అఖిల భారత స్థాయిలో ఉన్నత విద్యపై నిర్వహించిన సర్వేలో ఉన్నత విద్యలో ముస్లీం మహిళల నమోదులో తెలంగాణ రాష్ట్రం దేశంలో మొద టి స్థానంలో నిలువగా, తమిళనాడు రెండవ స్థా నం, కేరళ మూడవ స్థానంలో నిలిచాయి.

ఆ తర్వాత వరుసగా జమ్ము అండ్ కాశ్మీర్, ఢిల్లీ, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, చత్తీస్‌ఘడ్, పంజాబ్, బీహార్, కర్ణాటక, అస్సాం, గుజరాత్, ఉత్తరప్రదేశ్, ఝార్ఖండ్, పశ్చిమబెంగాల్, ఒడిశా, ఉత్తరాఖండ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, హర్యానా రాష్ట్రా లు నిలిచాయి. రాష్ట్రంలో ముస్లీం మహిళా విద్యార్థులకు ఉన్నత చదువులు అందించేందుకు ప్రభు త్వం ప్రత్యేక వసతులు కల్పించడంతో ఉన్నత విద్య నమోదులో తెలంగాణ రాష్ట్రం ముందంజలో ఉన్నదని సర్వే నివేదిక స్పష్టం చేసింది.

పాఠశాల విద్యలో మూడవ స్థానం

పాఠశాల విద్యలో ముస్లీం బాలికల నమోదులో కేరళ మొదటి స్థానంలో నిలిచిది. అలాగే జమ్ము అండ్ కాశ్మీర్ రెండవ స్థానంలో నిలువగా, తెలంగాణ రాష్ట్రం మూడవ స్థానంలో నిలిచింది. ఆ తర్వాత వరుసగా పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్,మహారాష్ట్ర, చత్తీస్‌ఘడ్, ఝార్ఖండ్, బీహార్, రాజస్థాన్, ఒడిశా, గుజరాత్, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, హర్యానా రాష్ట్రాలు నిలిచాయి.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News