Monday, May 20, 2024

కాస్కో…హరీశ్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/సిద్దిపేట ప్రతినిధి: ‘కొమురవెళ్లి మల్లన్న సాక్షిగా చె బుతున్నా,. ఆగస్ట్టు 15లోగా రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేసి సిద్దిపేట పాత బస్టాండ్ వద్దనే లక్ష మంది రైతులతో సభ నిర్వహిస్తా’ అని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం సిద్దిపేట పట్టణంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన రోడ్ షోలో పాల్గొన్న అనంతరం పాత బ స్టాండ్ అంబేడ్కర్ సర్కిల్ వద్ద కార్నర్ మీటింగ్‌లో ఆయన ప్రసంగించారు. ఎంఎల్‌ఎల హరీశ్‌రావు రాజీనామా లేఖతో సిద్ధంగా ఉండాల ని సవాల్ విసిరారు. హరీశ్‌రావు రాజీనామాతో సిద్దిపేటలో జరిగే ఉ ప ఎన్నికలో కొత్త ఎంఎల్‌ఎను గెలిపించుకునే బాధ్యత తనదేనని అ న్నారు. దొరల గడీలను బద్దలుకొట్టి తెలంగాణ ప్రజలు కాంగ్రెస్‌ను గె లిపించారన్నారు. ఇందిరా గాంధీని ఎంపిగా గెలిపించింది మెదక్ ప్రజలైతే.. 41 ఎంపి సీట్లు ఇచ్చి దేశానికి )
ప్రధానిని చేసింది తెలంగాణనే అని గుర్తు చేశారు.

మెదక్ ఎంపిగా ఇందిరాగాంధీ ఉన్నప్పుడు ఈ ప్రాంతానికి వందలాది పరిశ్రమలు తీసుకువచ్చారన్నారు. సోనియా గాంధీ తెలంగాణకు బయ్యారం ఉక్కు కర్మాగారంతో పాటు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, ఐటిఐఆర్ కారిడార్, పాలమూర్ రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, ఆదిలాబాద్‌లో గిరిజన యూనివర్సిటీ , నల్గొండలో ఐఐటి, మెదక్‌లో ఐఐఎంలను మంజూరు చేస్తే నరేంద్ర మోడీ వీటన్నింటిని కాలగర్భంలో కలిపి గాడిద గుడ్డును ఇచ్చారని ఎద్దేవా చేశారు. బిజెపి తెలంగాణ అభివృద్ధి కోసం చేసిందేమీ లేదని దుయ్యబట్టారు. కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, హరీశ్‌రావు, కెటి రామారావు, రఘునందన్‌రావు ఒక్కటేనని, వీరి పేర్లు మారినా రంగు, రుచి ఒక్కటేనని వ్యాఖ్యానించారు. బిజెపి, బిఆర్‌ఎస్ పొద్దటి పూట రెండు పార్టీలైతే.. రాత్రి పూట ఒక్కటే పార్టీ అని అన్నారు. తెలంగాణను దోచుకున్న ఈ ‘రావు’లు మనకు అవసరమా? అని అన్నారు. గత 45 సంవత్సరాల నుండి సిద్దిపేట నియోజకవర్గానికి మామా అల్లుడు శనిలా దాపురించారని ధ్వజమెత్తారు. ఈ శనీశ్వరుల నుంచి సిద్దిపేటకు విముక్తి కల్పిస్తానన్నారు.

రఘునందన్‌రావును దుబ్బాక ప్రజలు గెలిపిస్తే ఏంచేశాడని ప్రశ్నించారు. దుబ్బాక దొర రఘునందన్‌రావు అయితే, ఢిల్లీ దొర నరేంద్ర మోడీ అని, వీరిద్దరూ దుబ్బాక నియోజక వర్గానికి చేసింది శూన్యమేనన్నారు. బలహీన వర్గాల వారికి రాజకీయంగా ఉన్నత స్థాయి పదవులు ఇచ్చింది ఒక్క కాంగ్రెస్ మాత్రమేనని అన్నారు. ముదిరాజ్ బిడ్డ నీలం మధును ఎంపిగా గెలిపిస్తే ముదిరాజ్‌లను బిసి డి నుంచి బిసి ఏలో కలిపేందుకు పార్లమెంట్‌లో గళమెత్తుతారని అన్నారు. త్వరలోనే రాష్ట్రంలో ముదిరాజ్‌లకు మంత్రి పదవి ఇస్తానన్నారు. నిజాం రాజుకు కాసీం రజ్వీ ఎలా ఉండెనో.. కెసిఆర్, హరీశ్‌రావులకు ఆ పార్టీ ఎంపి అభ్యర్థి వెంకట్రామిరెడ్డి అలాగే ఉన్నాడన్నారు. మల్లన్నసాగర్, రంగనాయక సాగర్ భూనిర్వాసితులకు అన్యాయం చేసి ఇబ్బందులకు గురిచేసిన వెంకట్రామిరెడ్డికి ఓటుతో బుద్ధ్ది చెప్పాలన్నారు . ప్రాజెక్టుల పేరుతో పోలీసులతో బెదిరించి రైతుల భూములను లాక్కొని వందలాది ఎకరాలు సంపాదించింది వెంకట్రామిరెడ్డి కాదా? అని ప్రశ్నించారు.

సిద్దిపేటలో సభ నిర్వహిస్తే ప్రజలు వస్తారో.. రారో అని తమ పార్టీ నాయకులు అన్నారని.. ప్రజలు గడీల సంకెళ్లను తెంచుకుని వేలాది సంఖ్యలో సభకు తరలిరావడం ఎంతో సంతోషాన్నిచ్చిందని అన్నారు. ఇక నుంచి సిద్దిపేటకు పట్టిన శనిని వదిలించే బాధ్యత తనదేనని అన్నారు. అంతకుముందు మంత్రి దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, టిజెఎసి చైర్మన్ కోదండరాం, మెదక్ ఎంపి అభ్యర్థ్ధి నీలం మధు, పార్టీ సిద్దిపేట నియోజక వర్గ ఇన్‌ఛార్జి పూజల హరికృష్ణ మాట్లాడారు. ఈ సభలో మెదక్ ఎంఎల్‌ఎ మైనంపల్లి రోహిత్ రావు, నాయకులు నిర్మల జగ్గారెడ్డి, అద్దంకి దయాకర్, తూంకుంట నర్సారెడ్డి, చెరుకు శ్రీనివాస్‌రెడ్డి, ఎలక్షన్ రెడ్డి, మధన్‌రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News