Saturday, July 27, 2024

భానుడి భగభగ

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్:తెలంగాణ సెగ లు చిమ్ముతోంది. వడగాల్పుల ధాటికి జనం విల విల్లాడిపోతున్నారు. గత వారం రోజులుగా అసాధారణ రీతిలో పెరిగిపోతున్న ఉష్ణోగ్రతలు జనజీవనంపై పెను ప్రభావాన్ని చూపుతున్నాయి. రబిసీజన్‌లో సాగు చేసిన పంటకోతలు జోరుగా సా గుతున్నాయి. పొలాల్లో రైతులు వ్యవసాయ కూ లీలు ఎండల ధాటికి బెంబేలెత్తిపోతున్నారు. ఉత్త ర తెలంగాణ జిల్లాల్లోని ఉపరితల బొగ్గు గనుల్లో పని చేసే కార్మికలపై కూడా ఎండల తీవ్రత పెను ప్రభావం చూపుతోంది. అసలే కుతకుతలాడే బొ గ్గు నుంచి వస్తున్న వేడిగాలులకు తోడు సుర్రుమంటున్న సూరీడు నిప్పులు కక్కుతుండటంతో ఎండ వేడిని తట్టుకోలేక కార్మికులు పనులు మా నుకుంటున్నారు. దీంతో గత వారం రోజులుగా ఓపెన్‌కాస్ట్ గనుల్లో పనిచేసే కార్మికుల హాజరు ప ది నుంచి 20శాతం తగ్గిపోయింది.ఈ ప్రభావం బొగ్గు ఉత్పత్తిపై కూడా పడింది. రాష్ట్రంమంతటా ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి.

గత రెండు రో జులుగా ఉమ్మడి నల్లగొండ జిల్లా ఎండల తీవ్రత తో ఉడుకెత్తిస్తోంది. గురువారం రాష్ట్రంలోనే అత్యధికంగా నల్లగొండ జిల్లాలో 46.6డిగ్రీలు నమోదయ్యాయి.ఇబ్రహీంపట్నంలో46.6 వల్గటూరు లో 46.4 నేరెళ్ల , నాపంల్లి, మునగాల కేంద్రల్లో 46. 4డిగ్రీలు నమోదయ్యాయి. జన్నారంలో 46. 3, కేతపల్లి, మాడుగుల పల్లి, సుగ్లంపల్లి ,తెల్దేవరపల్లి కేంద్రాల్లో 46.2డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యా యి.గ్రేటర్ హైదరాబాద్‌లో 42.8డిగ్రీలు నమోదయ్యాయి. ద్రోణి దక్షిణ చత్తిస్‌గఢ్ నుంచి తెలంగా ణ ,రాయలసీమ మీదుగా దక్షిణ తమిళనాడు వర కు సగటు సముద్ర మట్టానికి 0.9 కి.మి.ఎత్తులో ఏర్పడింది దీని ప్రభావంతో కిందిస్థాయిలో గాలు లు రాష్ట్రంలో పశ్చిమ దిశ,వాయువ్య దిశలనుండి వీస్తున్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. నల్లగొండ, సిద్దిపేట, మంచిర్యాల , కొమరంభీమ్ ఆసిఫాబాద్, కరీంనగర్ , జోగులాంబ గద్వాల , జగిత్యాలతోపాటు మరి కొన్ని జిల్లాల్లో వేడిగాలులు వీస్తున్నట్టు తెలిపింది.రాగల 24గంటల్లో కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం,

నల్లగొండ, సూర్యాపేట, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూలు,
వనపర్తి, నారాయణపేట్, జోగులాంబ గద్వాల జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. ఈ జిల్లాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని వెల్లడించింది. గ్రేటర్ హైదరాబాద్‌లో గరిష్ట ఉష్ణోగ్రతలు 42డిగ్రీలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది.
వివిధ పనుల నిమిత్తం గడప దాటి బయటకు వస్తున్న వారు సైతం ఎండల ధాటికి జడుసు కుంటున్నారు. వాతావరణ కేంద్రం ఎప్పటికప్పుడు ఉపగ్రహాలు వాతవరణంలో మార్పులు , ఎండల తీవ్రతపై అదించే సమాచారాన్ని విశ్లేసించుకుంటూ ముందస్తు హెచ్చరికలు జారీ చేస్తోంది. గత రెండు రోజులుగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రెడ్‌అలర్ట్ జారీ చేసినప్పటికీ ప్రభుత్వ అధికారులు ఏ మాత్రం పట్టించుకోవటం లేదు. రెడ్ జోన్ ,ఆరెంజ్ జోన్ పరిధిలోకి వస్తున్న ప్రాంతాల్లో ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోకపోగా, విస్తృతమైన ప్రచారాలతో ప్రజలను సైతం అప్రమత్తం చేయటం లేదు. రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్నందున ఎన్నికల సంఘం నుంచి ఆదేశాలు వస్తే తప్ప తాము ఎటు వంటి చర్యలు తీసుకోలేమని వివిధ జిల్లాలకు చెందిన అధికారులు ఈసి నిబంధనల సాకుతో తప్పించుకుంటున్నారు.

రాష్ట్ర స్థాయిలో కూడా మొక్కుబడిగా ఉన్నతాధికారులు అడపా దడపా చేస్తున్న సమీక్షలు సమావేశాలు తప్ప వాతావరణంలో చోటు చేసుకుంటూ వస్తున్న అసాధారణ మార్పులకు తగ్గట్టుగా ప్రణాళికలు , వాటి అమలును ఆచరణలో చూపటం లేదన్న విమర్శలు వస్తున్నాయి.పైగా ప్రకృతి వైపరిత్యాలకు సంబంధించిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే అని సాకులు చెబుతున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. వేసవి ప్రారంభం కాగానే రాష్ట్ర స్థాయిలో మానటిరింగ్ సెల్ ను ఏర్పాటు చేసి, వాతావరణ కేంద్రం నుంచి వచ్చే సూచనలకు తగ్గట్టుగా మీడియా ద్వారా ప్రజలను అప్రమత్తం చేయటంతోపాటు ప్రభుత్వ పరంగా కూడా ప్రజలను వడగాల్పుల నుంచి కాపాడుకునేందుకు తీసుకోవాల్సిన కనీస చర్యలు కూడా కరువయ్యాయి. వడగాల్పులతో ప్రాణాలు విడిచిన వారి వివరాలు కూడా ప్రభుత్వం వద్ద లేవుంటున్నారు. మండలాలు , డివిజన్లు , జిల్లాలనుంచి కూడా తగిన రీతిలో ఎప్పటికప్పుడు సమాచారం రావటం లేదంటున్నారు.

మేల్కోకపోతే మరింత ప్రమాదం :
ప్రభుత్వ యంత్రాగం ఇప్పటికైనా మేల్కోకపోతే తెలంగాణ రాష్ట్రం ఎండల తీవ్రతతో మలమలమాడే ప్రమాదం ఉందన్న హెచ్చరికలు వినిపిస్తున్నాయి. వడ దెబ్బ మృతుల సంఖ్యను తగ్గించేందుకు జన సమూహాలు ఉండే ప్రాంతాల్లో చలువ పందిళ్లు ఏర్పాటు చేయటం. చల్లటి నీరు అందుబాటులో ఉంచటం, వ్యవసాయ పనులు జరిగే ప్రాంతాల్లో అక్కడక్కడా షామియానాలు ఏర్పాటు చేయటం. ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు తగినన్ని అందుబాటులో ఉంచటం , వడదెబ్బకు గురైన వారిని కాపాడుకునేందుకు తగిన వైద్య సహాయం అందుబాటులో ఉంచటం వంటి పనుల్లో అధికార యంత్రాంగం అపసోపాలు పడుతోందన్న ఆరోపణలు వస్తున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News