Saturday, June 8, 2024

ఉక్రెయిన్ సంక్షోభం

- Advertisement -
- Advertisement -
China Responsed to Ukraine-Russia War
అన్ని పక్షాలు సంయమనం పాటించాలి: చైనా
పరిస్థితి చేయి దాటిపోకుండా చూడాలి!

బీజింగ్/ఐరాస: ఉక్రెయిన్‌పై రష్యా దాడిపై గురువారం చైనా ప్రతిస్పందించింది. పరిస్థితి చేయి దాటిపోకుండా అన్ని పక్షాలు సంయమనం పాటించాలంది. “డాన్‌బాస్ ప్రాంతానికి పుతిన్ బలగాలను పంపడం ‘దాడి’, ఐక్యరాజ్య సమితి ఒప్పందం ఉల్లంఘన కాదా?” అని ప్రశ్నించగా, చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి హువా చున్‌యింగ్ “ఉక్రెయిన్ విషయంలో పరిస్థితులను చైనా చాలా సునిశితంగా గమనిస్తోంది అని మాత్రమే చెప్పగలను” అన్నారు. “పుతిన్ చర్య ఉక్రెయిన్ సార్వభౌమాధికారాన్ని ఉల్లంఘించే చర్యగా భావిస్తున్నారా?” అని అడిగిన ప్రశ్నకు ఆమె, “దీనికి చారిత్రక నేపథ్యం ఉంది. మేము చెప్పేదేమిటంటే దీంట్లో అనేక చిక్కు విషయాలు ఇమిడి ఉన్నాయి” అన్నారు.

రష్యా అధ్యక్షుడు వ్లాదిమీర్ పుతిన్ ‘లుగాన్స్ పీపుల్స్ రిపబ్లిక్’, ‘దొనేత్సక్ పీపుల్స్ రిపబ్లిక్’ అనే స్వతంత్ర, సార్వభౌమాదికార దేశాలను గుర్తించే రెండు డిక్రీలపై సోమవారం సంతకం చేశారు. ఉక్రెయిన్ పరిస్థితులను చైనా ఎప్పటికప్పుడు అంచనా వేస్తోంది. చైనా తనదైన పద్ధతిలో శాంతి చర్చలను ప్రోత్సాహించనున్నది. దౌత్య పరిష్కారానికి అన్ని ప్రయత్నాలు చేయనుంది. ఉక్రెయిన్‌పై మాస్కో చేపట్టిన చర్యలకు ప్రతిగా అమెరికా ఆంక్షలు ప్రకటించడాన్ని ఆమె విమర్శించారు. “ఆంక్షలు ఎన్నడూ సమస్యలను ప్రభావవంతంగా పరిష్కరించలేదు. పైగా చైనా ఎల్లప్పుడూ అక్రమ ఏకపక్ష ఆంక్షలను వ్యతిరేకించింది” అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News