Thursday, May 16, 2024

ఊడ్చే పని మానుకోబోనన్న ముఖ్యమంత్రి తల్లి !

- Advertisement -
- Advertisement -

Baldev Kaur
అమృత్‌సర్: ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీని 37,558 ఓట్ల తేడాతో ఓడించిన ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి లబ్ సింగ్ ఉగోకే తల్లి బల్దేవ్ కౌర్ ఇప్పటికీ ప్రభుత్వం పాఠశాలలో కాంట్రాక్టు స్వీపర్‌గా పనిచేస్తోంది. ‘ఊడ్వడం నా జీవితంలో ముఖ్య భాగం. నేను పాఠశాలలో నా పనిని కొనసాగిస్తాను’ అని ఆమె తెలిపింది. ఆమె 35 ఏళ్ల కుమారుడు ఆప్ టికెట్‌పైన, చీపురుకట్ట ఎన్నికల గుర్తుపైన గెలుపొందాడు. ఉగోకే తన అఫిడవిట్‌లో 2014లో హీరో హోండా మోటార్‌సైకిల్ కొన్నట్లు తెలిపాడు. కాగా చన్నీ మాత్రం తనకు స్థిర, చరాస్తులు రూ. 7.97 కోట్లు ఉన్నాయని, రూ.4 కోట్ల ఇల్లు ఉందని చూయించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News