Saturday, July 27, 2024

కేజ్రీవాల్ వర్సెస్ బిజెపి.. ఢిల్లీలో ఉద్రిక్తత..

- Advertisement -
- Advertisement -

దేశ రాజధాని ఢిల్లీలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఢిల్లీలోని బిజెపి పార్టీ ప్రధాన కార్యాలయాన్ని ముట్టడించేందుకు ర్యాలీగా వెల్లేందుకు ఆప్ నేతలు, కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. శనివారం సీఎం కేజ్రీవాల్ పిఎను పోలీసులు అరెస్టు చేయడంతో.. నగరంలోని బిజెపి కార్యాలయాన్ని ముట్టడించేందుకు ఆయన పిలుపునిచ్చారు. బిజెపి ఆఫీస్ వస్తామని.. ఇష్టమొచ్చిన వారిని జైల్లో పెట్టండని కేజ్రీవాల్ సవాల్ విసిరారు.

ఈక్రమంలో ఆదివారం పెద్ద ఎత్తున ఆప్ నాయకులు, కార్యకర్తలు ఆప్ ప్రధాన కార్యాలయానికి తరలివచ్చారు. సిఎం కేజ్రీవాల్, మంత్రులతో సహా ఆప్ నాయకులు, కార్యకర్తలు.. బిజెపి కార్యాలయాన్ని ముట్టడించేందుకు ర్యాలీగా వెళ్తుండగా.. అక్కడే పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. మమ్మలీ అడ్డుకుంటే.. అక్కడే బైఠాయించి ఆందోళన చేస్తామని కేజ్రీవాల్ పోలీసులను హెచ్చరించారు. మమ్మల్నీ అరెస్టు చేయకుంటే బిజెపి ఓడినట్లేనన్నారు. మరోవైపు, బిజెపి కార్యాలయం వద్ద ఉదయం నుంచే భారీగా పోలీసులు, కేంద్ర బలగాలను మొహరించారు. భారీ గ్రేడ్లతో భద్రతను కట్టుదిట్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News