Monday, May 6, 2024

ఈరోజు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలినుద్దేశించి ప్రసంగించనున్న జెలెన్స్కీ

- Advertisement -
- Advertisement -

Zelensky visits Bucha near Kyiv on April 4

జర్మనీ, ఫ్రాన్స్ డజన్ల కొద్దీ రష్యన్ దౌత్యవేత్తలను గూఢచారులని పేర్కొని బహిష్కరించాయి

యుద్ధ నేరాలకు పాల్పడినందుకు వ్లాదిమిర్ పుతిన్‌ను విచారించాలన్నారు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్

న్యూఢిల్లీ: కీవ్ శివార్ల నుండి రష్యా దళాలను ఉపసంహరించుకున్న తర్వాత మాస్కో ప్రపంచవ్యాప్త తిరస్కారాన్ని, యుద్ధ నేరాల ఆరోపణలను ఎదుర్కొంది.  వీధుల్లో పౌరుల శవాలు వెలుగుచూశాయి. వారిలో కొందరు చాలా దగ్గర నుంచి కాల్చి చంపబడ్డారు. ఇది క్రెమ్లిన్‌పై కఠినమైన ఆంక్షల కోసం పిలుపునిచ్చేందుకు దారితీసింది. జర్మనీ, ఫ్రాన్స్ డజన్ల కొద్దీ రష్యన్ దౌత్యవేత్తలను బహిష్కరించాయి, వారు గూఢచారులని పేర్కొన్నాయి.  కాగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను యుద్ధ నేరాలకు సంబంధించి విచారించాలని పేర్కొన్నారు. కాగా ఈరోజు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలినుద్దేశించి ఉక్రెయిన్ అధ్యక్షుడు  జెలెన్స్కీ ప్రసంగించనున్నారు.

ఇదిలావుండగా ఉక్రెయిన్ ప్రభుత్వం ఫిబ్రవరి 24 న రష్యా దాడి ప్రారంభమైనప్పటి నుండి దేశంలో దాదాపు 18 మంది జర్నలిస్టులు చంపబడ్డారని తెలిపింది. ఉక్రేనియన్ సంస్కృతి మరియు సమాచార మంత్రిత్వ శాఖ సోమవారం సోషల్ మీడియాలో ఒక ప్రకటనలో మీడియా ప్రతినిధుల మరణాలపై దర్యాప్తు చేస్తామని పేర్కొంది. మరి 13 మంది జర్నలిస్టులు గాయపడ్డారని, ఎనిమిది మంది అపహరణకు గురయ్యారని లేదా బందీలుగా ఉన్నారని, ఇంకా ముగ్గురు జర్నలిస్టులు కనిపించకుండా పోయారని ఆ మంత్రిత్వ శాఖ తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News