Tuesday, July 1, 2025

కుప్పకూలిన హెలికాప్టర్: ఇద్దరు మృతి

- Advertisement -
- Advertisement -

Two Members dead in Helicopter accident

రాయ్‌పూర్: హెలికాప్టర్ కుప్పకూలిపోవడంతో ఇద్దరు పైలట్లు మృతి చెందిన సంఘటన ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌లో జరిగింది. విమానాశ్రయ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం… హెలికాప్టర్‌ను ల్యాండింగ్ చేస్తున్న సమయంలో రాయ్‌పూర్ విమానాశ్రయంలో గురువారం రాత్రి 9.10 నిమిషాలకు కూలిపోయింది. ఇద్దరు పైలట్లు ఘటనా స్థలంలోనే చనిపోయారు. మృతి చెందిన పైలట్లు కెప్టెన్ శ్రీ వాస్తవ, గోపాల్ కృష్ణ పాండాగా గుర్తించారు. రాయ్‌పూర్ ఎయిర్ పోర్ట్ డైరెక్టర్ రాకేశ్ సహాయ ప్రమాదం జరిగిందిని మీడియాకు తెలిపాడు. ఫ్లయిండ్ ప్రాక్టీస్ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని వెల్లడించారు. ఈ ప్రమాదానికి కారణాలు ఇంకా తెలియలేదని, సాంకేతిక కారణాలతో ప్రమాదం జరిగి ఉంటుందని అనుమానం వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News