Tuesday, April 30, 2024

ఆరు బ్యాంకింగ్ లైసెన్స్ దరఖాస్తులకు ఆర్‌బిఐ నో

- Advertisement -
- Advertisement -

RBI says no to six banking licence applicants

ముంబై : ఆర్‌బిఐ(భారతీయ రిజర్వ్ బ్యాంక్) మొత్తం 11 కొత్త బ్యాంకుల్లో 6 బ్యాంకుల దరఖాస్తును తిరస్కరించింది. అయితే 5 బ్యాంకులు దరఖాస్తులను రిజర్వు బ్యాంక్ ఆమోదించింది. దరఖాస్తులు రద్దు అయిన 6 బ్యాంకులలో ఒక బ్యాంకును ఫ్లిప్‌కార్ట్ సహ వ్యవస్థాపకుడు సచిన్ బన్సాల్ ప్రతిపాదించారు. ఈ బ్యాంక్ పేరు చైతన్య ఇండియా ఫిన్ క్రెడిట్ ప్రైవేట్ లిమిటెడ్‌గా ఉంది. ఈ బ్యాంకులు బ్యాంకింగ్ అవసరాలు, ప్రమాణాలను అందుకోలేకపోయాయి. 6 బ్యాంకులలో కొన్ని బ్యాంకులు స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ కేటగిరీకి చెందినవి. ఆర్‌బిఐ నిబంధనలను పాటించనందున ఈ బ్యాంకుల దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News