Tuesday, July 22, 2025

తీవ్ర నిరుద్యోగతే హింసకు కారణం: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

KTR respond on Secunderabad violence

హైద‌రాబాద్‌: కేంద్ర ప్రభుత్వం ప్రవేళ పెట్టిన అగ్నిప‌థ్ స్కీమ్‌ను వ్య‌తిరేకిస్తూ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ను ఆందోళనకారులు తగలబెట్టారు.  అగ్నిపథ్ స్కీమ్ కు వ్యతిరేకంగా దేశంలో యువత ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా  రాష్ట్ర ఐటిశాఖ మంత్రి కెటిఆర్ స్పందించారు. దేశంలో నిరుద్యోగ శాతం భారీగా పెరిగిందని, అగ్నివీర్ స్కీమ్ ను వారు వ్యతిరేకించడంతో పాటు ఆందోళనను ఉధృతం చేశారని మంత్రి కెటిఆర్ తన ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. మోడీ ప్రభుత్వం తొలుత రైతులతో ఆడుకుందని, ఇప్పుడు దేశ జవాన్లతో ఆడుకుంటోందని మండిపడ్డారు. వన్ ర్యాంక్ వన్ పెన్షన్ విధానం నుంచి ఇప్పుడు దేశంలో నో ర్యాంక్ నో పెన్షన్ గా మారిందని మండిపడ్డారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News