Friday, May 3, 2024

బ్రిటన్ లోని మంకీ పాక్స్ కేసుల్లో గతం కన్నా భిన్నమైన లక్షణాలు

- Advertisement -
- Advertisement -

Monkeypox symptoms differ from previous

 

లాన్సెట్ అధ్యయనం వెల్లడి

లండన్ : ప్రపంచంలో ఎక్కడైనా ఇదివరకు వ్యాపించిన మంకీపాక్స్ లక్షణాలకు భిన్నంగా బ్రిటన్‌లో మంకీపాక్స్ రోగుల్లో వేరే లక్షణాలు కనిపిస్తున్నాయని లాన్సెట్ అధ్యయనం వెల్లడించింది. ది లాన్సెట్ ఇన్‌ఫెక్షీయస్ డిసీజెస్ జర్నల్‌లో ప్రచురించిన ఈ అధ్యయనం శనివారం వెల్లడైంది. లండన్ లోని సెక్సువల్ హెల్త్ క్లినిక్స్‌లో అడ్మిట్ అయిన 54 మంది రోగులను ఈ ఏడాది మే నెలలో 12 రోజుల వ్యవధిలో అధ్యయనం చేయగా వారిలో మంకీపాక్స్ లక్షణాలు కనిపించాయి. ఈ గ్రూపు రోగుల్లో ఇదివరకటి రోగులకు భిన్నంగా జననేంద్రియాలు, ఆసనాల వద్ద పుండ్లు వంటివి ఎక్కువగా ఉండడం, అలసట, జ్వరం తక్కువగా ఉండడాన్ని పరిశోధకులు కనుగొన్నారు.

ఈమేరకు కనుగొన్న లక్షణాల ఆధారంగా అరుదైన ప్రస్తుత మంకీపాక్స్ కేసు నిర్వచనాలు ఆయా కేసులను గుర్తించడానికి సహాయంగా తప్పనిసరిగా సమీక్షించవలసి ఉందని పరిశోధకులు పేర్కొన్నారు. జననేంద్రియాలపై పుండ్లు వంటివి ఎక్కువగా కనిపించడం బట్టి లైంగిక సంపర్క సంబంధ వ్యాధులు వ్యాపించే మంకీపాక్స్ కేసులను కూడా అదనంగా భవిష్యత్తులో సెక్సువల్ హెల్త్ క్లినిక్‌లు చికిత్స చేయవలసి వస్తుందని పరిశోధకులు భావిస్తున్నారు. ఇలాంటి కేసులను పరిశీలించి వైద్య చికిత్స అందించడానికి అదనపు వనరులు అవసరమవుతాయని పరిశోధకులు సూచించారు. ఇతర దేశాల మంకీపాక్స్ కేసులతో ఎలాంటి పోలిక లేకుండా ప్రస్తుతం బ్రిటన్ వంటి కొన్ని దేశాల్లో మంకీపాక్స్ కేసులు విస్తరిస్తున్నాయని, ఈ రోగులు అధిక సంఖ్యలో సెక్సువల్ హెల్త్ క్లినిక్‌లకు హాజరవుతున్నారని చెల్సియా అండ్ వెస్ట్‌మినిస్టర్ హాస్పిటల్ ఎన్‌హెచ్‌ఎస్ ఫౌండేషన్ ట్రస్ట్‌కు చెందిన నికొలొ గిరొమిట్టి వివరించారు. తమ అధ్యయనం భవిష్యత్తులో లైంగిక వ్యాధుల సంబంధ మంకీపాక్స్ కేసులను పరిశీలించి తగిన చికిత్స అందించడానికి ఉపయోగపడుతుందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News