Tuesday, May 21, 2024

అబ్బాయికి బాబాయ్ ఝలక్

- Advertisement -
- Advertisement -

Shivpal Yadav supports NDA candidate

ఎన్డీయే అభ్యర్థికి శివపాల్ మద్దతు

లఖ్‌నవూ : రాష్ట్రపతి ఎన్నికల వేళ ఉత్తరప్రదేశ్ లోని సమాజ్‌వాది పార్టీలో లుకలుకలు బయటపడుతున్నాయి. అఖిలేశ్ వ్యవహారం నచ్చక గతంలో ఓసారి వేరుకుంపటి పెట్టుకున్న శివపాల్ యాదవ్, ఇటీవల అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎస్పీతో జట్టుకట్టి ఎన్నికల బరిలోకి దిగారు. ఎన్నికల ఫలితాల అనంతరం బాబాయి, అబ్బాయి మధ్య మళ్లీ దూరం పెరిగిందని వార్తలొచ్చాయి. తాజాగా ఈ వ్యవహారం బహిర్గతం అయింది. త్వరలో జరగబోయే రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే బలపరిచిన ద్రౌపది ముర్ముకు ఓటేయాలని శివపాల్ నిర్ణయించడంతో వీరి మధ్య దూరం పెరిగినట్టు తేలింది. “రాష్ట్రపతి ఎన్నికల్లో ద్రౌపది ముర్ముకు ఓటేయాలని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్ కోరారు. కాబట్టి ఎన్డీయే అభ్యర్థికి ఓటేయాలని నిర్ణయించుకున్నాను. ”అని శివపాల్ యాదవ్ శనివారం తెలిపారు. విపక్ష అభ్యర్థికి ఓటేయాలని అఖిలేశ్ తనను కోరలేదన్న శివపాల్, తనను పార్టీ కార్యక్రమాలకు పిలవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. యశ్వంత్ సిన్హా రాక సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశానికి తనను ఆహ్వానించలేదని తెలిపారు. అఖిలేశ్ యాదవ్ అపరిపక్వత కారణంగా కూటమిలో పార్టీలు తలోదారి చూసుకుంటున్నాయని శివపాల్ అన్నారు.

యూపీ ఎస్పీ కూటమిలో విభేదాలు
అంతకు ముందు శుక్రవారం యోగి ఆదిత్యనాధ్ ఏర్పాటు చేసిన విందుకు ఎస్పీ మరో మిత్ర పక్షం సుహేల్దేవ్ భారతీయ సమాజ్ పార్టీ అధ్యక్షుడు ఓం ప్రకాశ్ రాజ్‌భర్‌తో కలిసి శివపాల్ యాదవ్ హాజరయ్యారు. ఈ విందులో బీస్పీకి చెందిన ఎమ్‌ఎల్ ఎ ఒకరు కూడా పాల్గొన్నారు. ఈ భేటీ అనంతరం ఓం ప్రకాశ్ రాజ్‌భర్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రపతి ఎన్నికల్లో
మద్దతిచ్చే అంశంపై పార్టీలో అంతర్గతంగా చర్చిస్తామని పేర్కొన్నారు. ఎస్పీతో విడాకులు కోరుకుంటున్నట్టు వ్యాఖ్యానించారు. ఆ మరుసనటి రోజే యాదవ్ ఎన్డీయే అభ్యర్థికి మద్దతు ఇస్తున్నట్టు ప్రకటించడంతో అఖిలేశ్ యాదవ్‌కు సొంత కూటమి నుంచే ఎదురుదెబ్బ తగిలినట్టయింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News