Wednesday, May 8, 2024

షింజో అబె హత్యకు… అగ్నిపథ్ పథకానికి ముడి ?

- Advertisement -
- Advertisement -

Link to Shinzo Abe's murder with Agnipath

చర్చనీయాంశంగా మారిన కథనం

కోల్‌కతా : జపాన్ మాజీ ప్రధాని షింజో అబె హత్యకు, కేంద్రం ఇటీవల ప్రవేశ పెట్టిన అగ్నిపథ్ పథకానికి ముడిపెడుతూ టీఎంసీ అధికార పత్రిక ‘జాగో బంగ్లా’ వెలువరించిన ఓ కథనం చర్చనీయాంశంగా మారింది. షింజో అబె హత్య ఘటన…. అగ్నిపథ్‌పై వ్యతిరేకతను బలపరుస్తుందని, ఈ బెంగాలీ కథనం పేర్కొంది. ఎందుకంటే అబెను హత్య చేసిన నిందితుడు సైతం పెన్షన్ లేకుండా ఒప్పంద ప్రాతిపదికగా సైన్యంలో మూడేళ్లు పనిచేసినట్టు చెప్పుకొచ్చింది. భారత్ కూడా తాజాగా రక్షణ బలగాల్లో ఇదే తరహా నియామకాలు చేపడుతోంది. దీనికింద అభ్యర్థులు కేవలం నాలుగున్నరేళ్లు మాత్రమే విధుల్లో ఉంటారు. ఆ తర్వాత పెన్షన్ ఉండదు. పదవీ విరమణ అనంతరం ఇతర ప్రయోజనాలు దక్కవు అని కథనంలో పొందుపర్చింది. అబె హత్య కేసులో నిందితుడు తెత్సుయ యమగామి… జపాన్ నౌకాదళంలో మూడేళ్లపాటు పనిచేశాడని, ఆ తర్వాత అతనికి ఎలాంటి ఉద్యోగం రాలేదని కథనం పేర్కొంది. సైన్యంలో ఉద్యోగం పోయిన తర్వాత , అబెపై కోపంగా ఉందని అతను పోలీసులకు తెలిపాడని, అందులో వివరించింది. ఇదిలా ఉండగా, ఎన్నికల ప్రచారంలో ఉన్న షింజో అబె శుక్రవారం హత్యకు గురైన విషయం తెలిసిందే. దుండగుడు వెనుక నుంచి కాల్పులు జరపడంతో ఆయన కుప్ప కూలారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News