Wednesday, May 29, 2024

కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్‌పై తీర్పు వాయిదా

- Advertisement -
- Advertisement -
బెయిలిస్తే అధికారిక విధులు నిర్వర్తించరాదు
సుప్రీంకోర్టు షరతు: బెయిల్‌కు ఇడి వ్యతిరేకత
కేజ్రీవాల్ జుడిషియల్ కస్టడీ మే 20 వరకు పొడిగింపు

న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు మంగళవారం సుప్రీంకోర్టు ఉపశమనం లభించలేదు. మధ్యంతర బెయిల్ కోరుతూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌పై తీర్పును సుప్రీంకోర్టు వాయిదా వేసింది. ఈ పిటిషన్‌ను వచ్చే గురువారం(మే 9) కాని వచ్చే వారం కాని ముగిస్తామని సుప్రీంకోర్టు తెలిపింది. కాగా..పిటిషన్ విచారణ సందర్భంగా కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్ ఇచ్చిన పక్షంలో ఆయన అధికారికి ఫైళ్లపై ఎటువంటి సంతకాలు చేయకూడదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. 2022 గోవా ఎన్నికల సందర్భంగా కేజ్రీవాల్ ఒక సెవన్ స్టార్ హోటల్‌లో బసచేశారని, ఆయన బిల్లులో కొంత భాగాన్ని ఢిల్లీ ప్రభుత్వానికి చెందిన సాధారణ పరిపాలన శాఖ భరించిందని ఇడి తెలియచేసింది.

బెయిల్‌పై విడుదలైన తర్వాత కేజ్రీవాల్ ఎక్సైజ్ పాలసీకి సంబంధించిన ఫైళ్లను చూడరని ఆయన తరఫు న్యాయవాది కోర్టుకు విన్నవించగా ఆయన అధికారిక బాధ్యతలేవీ చూడకూడదని తాము చెబుతున్నామని కోర్టు స్పష్టం చేసింది. అప్రూవర్ల వాంగ్మూలాలను ఇడి తొక్కిపెట్టిందంటూ కేజ్రీవాల్ చేసిన వాదనను ఇడి తరఫున హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్‌వి రాజు తోసిపుచ్చుతూ జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాతో కూడిన ధర్మాసనంకు ఒక నోట్ అందచేశారు. ప్రస్తుత లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఆప్ అధినేత అయిన కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసే విషయాన్ని పరిశీలిస్తామని ధర్మాసనం ఇదివరకు సూచించింది.

అయితే ఈ సూచనను ఇడి నిర్దంద్వంగా తోసిపుచ్చింది. ఇది ప్రజలలో తప్పుడు సంకేతాలు పంపుతుందని ఇడి తెలిపింది. ఆయన ఢిల్లీ ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రి. ఎన్నికలు ఉన్నాయి. ఇవి అసాధారణ పరిస్థితులు. ఆయన స్వాభావికంగా నేరస్థుడు కారు అని ధర్మాసనం తెలిపింది. బెయిల్‌పై విడుదల చేస్తే ఆయనను ముఖ్యమంత్రి విధులను నిర్వహించడానికి అనుమతించబోమని, ఆయన అధికారిక ఫైళ్లపై సంతకాలు చేయరాదని ధర్మాసనం తెలిపింది. కాగా..మధ్యంతర బెయిల్‌ను మంజూరు చేసిన పక్షంలో కేజ్రీవాల్ రాజకీయ కార్యకలాపాలపై ఆంక్షలు విధించడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని ఆయన తరఫు సీనియర్ న్యాయవాది ఎఎం సింఘీ తెలిపారు. అయితే కేజ్రీవాల్‌కు మధ్యంతర బిల్లు ఇవ్వడాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తామని ఇడి తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, అదరనపు సొలిసిటర్ జనరల్ ఎస్‌వి రాజు తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News