Monday, June 17, 2024

కవిత బెయిల్ పిటిషన్లపై విచారణ వాయిదా

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: లిక్కర్ స్కామ్ కేసులో కవిత బెయిల్ పిటిషన్ రేపటికి (మే 28కి) వాయిదా పడింది. న్యాయమూర్తి స్వర్ణకాంత్ శర్మ విచారణ చేపట్టనున్నారు.  సిబిఐ, ఈడి దాఖలు చేసిన కేసుల్లో బెయిల్ పిటిషన్లపై రేపు విచారణ జరుగనున్నది. దర్యాప్తు సంస్థలు కవిత అరెస్టులో చట్టాన్ని ఉల్లంఘించాయని ఆరోపించారు. సిబిఐ రేపు కూడా వాదనలు వినిపించనున్నది. ఇప్పటికే సిబిఐ, ఈడి కౌంటర్ అఫిడవిట్లను దాఖలు చేశాయి. కాగా విచారణ రేపు మధ్యాహ్నానికి వాయిదా పడింది.

కవిత తరఫు న్యాయవాది విక్రమ్ చౌదరి పలు కీలక విషయాలను కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. కవితపై చర్యలు తీసుకోబోమంటూ మొదట్లో ఈడి సుప్రీంకోర్టుకు అండర్ టేకింగ్ ఇచ్చిందని, కవిత వేసిన రిట్ పిటిషన్ సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉండగానే ఈడి సుప్రీంకోర్టుకు లేఖ రాసిందిని తెలిపారు.

కవిత జ్యడీషియల్ కస్టడీలో ఉండగానే ఆమెను ప్రశ్నించాలంటూ సిబిఐ పిటిషన్ వేసిందన్నారు. పిటిషన్ ను కోర్టు అంగీకరించగా, కవితకు మాత్రం సమాచారం ఇవ్వలేదన్నారు. కనీసం అరెస్టు వారెంటు కూడా లేకుండానే సిబిఐ కవితను అరెస్టు చేసిందని వివరించారు. కాగా రేపు కౌంటర్ వాదనలు వినిపించనున్నట్లు ఈడి కోర్టుకు తెలిపింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News