Tuesday, October 22, 2024

భగ్గుమంటున్న ఉత్తర భారతం.. రెడ్ అలర్ట్ జారీ

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఉత్తర భారతంలో ఎండలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. వేసవి ముగిసినా ఉష్ణోగ్రతల తీవ్రత తగ్గడం లేదు. బీహార్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, పంజాబ్, హర్యానా, ఢిల్లీ రాష్ట్రాల్లో వేడిగాలులకు ప్రజలు అల్లాడిపోతున్నారు. మరీ ముఖ్యంగా ఢిల్లీలో ఎండ తీవ్రత బాగా పెరగడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ఆయా రాష్ట్రాలకు భారత వాతావరణ శాఖ రెడ్ అలెర్ట్ జారీ చేసింది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటిపోయాయి. ఇవి మరింత పెరగనున్నట్టు వాతావరణ శాఖ వెల్లడించింది.

రెండు గంటలు నిలిచిపోయిన విమానం
అత్యధిక ఉష్ణోగ్రతల కారణంగా ఇండిగో విమాన ప్రయాణానికి తీవ్ర ఆటంకం కలిగింది. గంటల పాటు ఆలస్యం కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గాలి లేక కొందరు అస్వస్థతకు గురయ్యారు. వివరాల్లోకి వెళ్లితే సోమవారం ఇండిగో విమానం 6ఇ 2521 ఢిల్లీ నుంచి బెంగాల్ లోని బాగ్‌డోగ్రా బయలుదేరేందుకు సిద్ధమైంది. మధ్యాహ్నం 2.30 కు టేకాఫ్ కావాల్సిన విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. ఢిల్లీలో అధిక ఉష్ణోగ్రతలు నమోదు కావడమే అందుకు కారణంగా తెలుస్తోంది. దీంతో ఫ్లైట్ టేకాఫ్‌కు రెండు గంటలు ఆలస్యమైంది.

అప్పటికే ప్రయాణికులు విమానంలో కూర్చున్నారు. డోర్ మూసివేయడంతో వేడి తీవ్రత ఎక్కువైంది. ఏసీ పనిచేయకపోవడంతో కొందరు ప్రయాణికులు అస్వస్థతకు గురైనట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ప్రయాణికులకు కలిగిన అసౌకర్యంపై ఇండిగో ఆవేదన వ్యక్తం చేసింది. అధిక ఉష్ణోగ్రత కారణం గానే సాంకేతిక లోపం తలెత్తిందని వివరణ ఇచ్చింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News