Tuesday, June 18, 2024

రెమాల్ తుఫానులో 10కి పెరిగిన మృతుల సంఖ్య

- Advertisement -
- Advertisement -

దాదాపు 30,000 ఇళ్లు ధ్వంసం

ఢాకా: రెమాల్ తుఫాను బీభత్సం కారణంగా బంగ్లదేశ్ లో మృతుల సంఖ్య 10 కి పెరిగింది. దాదాపు 30000 ఇళ్లు ధ్వంసం అయ్యాయని కోస్తా ప్రాంత ప్రభుత్వం అధికారులు తెలిపారు. ముగ్గురు గాయపడ్డారు. కోల్ కతాలోని అనేక ప్రాంతాల్లో చెట్లు నేలమట్టం అయ్యాయి.  రెమాల్ తుఫాను పశ్చిమ బెంగాల్,  బంగ్లాదేశ్ ను తాకిందని సోమవారం అధికారులు తెలిపారు.

సదరన్ అవెన్యూ, లేక్ ప్లేస్, చెట్లా, డిఎల్ ఖాన్ రోడ్, డఫెరిన్ రోడ్, బల్లిగంజ్ రోడ్, న్యూ అలీపూర్, బెహలా, జాదవ్‌పూర్, గోల్‌పార్క్, హతిబాగన్, జగత్ ముఖర్జీ పార్క్ , కాలేజ్ స్ట్రీట్, అలాగే నగరంలోని చెట్లను నేలకూల్చినట్లు నివేదికలు అందాయి.

కోల్‌కతాలో 68 చెట్లు, సమీపంలోని సాల్ట్ లేక్ , రాజర్‌హత్ ప్రాంతంలో మరో 75 చెట్లు నేలకూలాయి. “సదరన్ అవెన్యూ, లేక్ వ్యూ రోడ్, ప్రతాపాదిత్య రోడ్, టోలీగంజ్ ఫారి, అలీపూర్ మరియు సెంట్రల్ అవెన్యూతో సహా పలు ప్రాంతాలలో నీరు నిలిచిపోవడంతో ట్రాఫిక్ మళ్లింపు జరిగింది” అని కోల్‌కతా ట్రాఫిక్ పోలీస్ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. తుఫాను తాకిడికి మానిక్‌టాలా ప్రాంతంలో ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారు, అయితే ఖచ్చితమైన కారణం ఇంకా తెలియాల్సి ఉందని ఒక అధికారి తెలిపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News