Saturday, July 27, 2024

తూర్పు అస్సాంలో బలహీనపడుతున్న రెమాల్ తుఫాన్

- Advertisement -
- Advertisement -

15 మంది ప్రాణాలు బలిగొని, అనేక మందిని గాయపరిచిన రెమాల్ తుఫాను తూర్పు అస్సాం ప్రాంతంలో బలహీనపడుతోంది. మే 28(మంగళవారం) సాయంత్రం కల్లా బలహీనపడిపోతుంది. ఈ విషయాన్ని భారత వాతావరణ శాఖ(ఐఎండి) నివేదించింది.

‘‘ గత 6 గంటలలో గంటకు 16 కిమీ. స్పీడుతో ఈ అల్పపీడనం(డిప్రెషన్) బంగ్లాదేశ్ వైపు కదిలింది. తూర్పు అస్సాంలో ఈ అల్పపీడనం బలహీన పడనున్నది. అస్సాంలోని అనేక జిల్లాలను హై రెడ్ అలర్ట్ లో ఉంచారు. ఈ తుఫాను కారణంగా అస్సాంలోని కామ్ రూప్, నాగావ్, సోనిత్పుర్, మోరీగావ్ సహా 11 జిల్లాలు బాగా దెబ్బతిన్నాయని అధికారులు తెలిపారు. సోనిత్పుర్ జిల్లాలోని ధేకియాజులిలో భారీ వర్షం కారణంగా ఓ చెట్టు 12 మంది విద్యార్థులు ప్రయాణిస్తున్న స్కూల్ బస్ మీద విరిగిపడింది. ఉషా ఇంగ్లీష్ స్కూల్ కు చెందిన 12 మంది విద్యార్థులను వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

School Bus

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News